Breaking News: సంచలనం.. కవితను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
ABN , First Publish Date - Sep 02 , 2025 | 08:11 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Sep 02, 2025 13:17 IST
బీఆర్ఎస్ సంచలనం
BRS సంచలన నిర్ణయం
పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్.
-
Sep 02, 2025 11:09 IST
కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా..
ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్న కేసీఆర్, హరీష్‌రావు
కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లకు అర్హత లేదన్న అడ్వొకేట్ జనరల్
కాళేశ్వరం రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చించినట్టు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లిన ఏజీ
కేసును సీబీఐకి అప్పగించనున్నట్టు కోర్టుకు తెలిపిన ఏజీ
ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు స్పష్టం చేసిన ఏజీ
సీబీఐ విచారణ తర్వాత చర్యలుంటాయని హైకోర్టుకు తెలిపిన ఏజీ
-
Sep 02, 2025 10:19 IST
పుతిన్-మోదీ వీడియోతో ట్రంప్‌నకు కాలిఫోర్నియా గవర్నర్ కౌంటర్
SCO సమిట్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలుసుకున్న వీడియోను..
ట్రంప్‌నకు షేర్ చేసిన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్
భయపడకండి.. ట్రంప్ గార్డ్‌ను షికాగోకు పంపుతున్నాం: కాలిఫోర్నియా గవర్నర్
-
Sep 02, 2025 10:19 IST
ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం
ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరు గ్రామస్తులను చంపిన మావోయిస్టులు
సిర్సట్టి పంచాయతీలోని నందాపారాలో ఘటన
-
Sep 02, 2025 10:18 IST
MLC కవిత వ్యాఖ్యలపై BRS మౌనం
కవిత కామెంట్స్‌పై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని ఆదేశాలు
కవిత వ్యవహారం కేసీఆర్ చూసుకుంటారని సూచన
-
Sep 02, 2025 10:18 IST
కవిత వ్యాఖ్యలపై హరీష్‌రావు అభిమానుల ఆగ్రహం
కవిత టార్గెట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు
లిక్కర్ స్కామ్ వల్ల కేసీఆర్‌కు మచ్చ పడలేదా అంటూ రివర్స్ ఎటాక్
మేనమామ వెంట నడిచిన మేనల్లుడు కాదు.. నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు హరీష్‌రావు అంటూ పోస్టులు
-
Sep 02, 2025 09:10 IST
MLC కవిత వ్యాఖ్యలతో BRSలో కల్లోలం
హరీష్‌రావు, సంతోష్‌రావును టార్గెట్ చేసిన కవిత
కవిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న BRS ముఖ్యనేతలు
BRS వాట్సాప్ గ్రూప్‌ల నుంచి కవిత అనుచరులు, సిబ్బంది తొలగింపు
హరీష్‌రావుకు మద్దతుగా BRS పార్టీ, KTR పోస్టులు
నిన్న ఫాంహౌస్‌లో ముఖ్యనేతల భేటీలో కవిత వ్యాఖ్యలపై చర్చ
కవితను సస్పెండ్ చేస్తారా? వదిలేస్తారా?
కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని విస్తృత ప్రచారం
కేసీఆర్ నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ
-
Sep 02, 2025 09:09 IST
కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖను కోరిన ప్రభుత్వం
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కోరిన తెలంగాణ సర్కార్
-
Sep 02, 2025 09:09 IST
సీఎం చంద్రబాబు సమీక్ష..
నేడు ఉ.10:30కు హార్టికల్చర్, మార్కెటింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
ఉ.11:40కి సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
మ.2గంటలకు విశౄఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ అండ్ ఆజిస్టిక్స్ సమ్మిట్
-
Sep 02, 2025 09:09 IST
రైతులు ఆందోళన..
వరంగల్: రాయపర్తి వ్యవసాయ సహకార సంఘం దగ్గర ఉద్రిక్తత
యూరియో పంపిణీలో గందరగోళం, రైతులు ఆందోళన
-
Sep 02, 2025 08:11 IST
కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖను కోరిన ప్రభుత్వం
కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని కోరిన తెలంగాణ సర్కార్
-
Sep 02, 2025 08:11 IST
ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
5 రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు
ఏపీలోని 4 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రెండు రోజుల అతి భారీ వర్షాలు
తెలంగాణలో 13 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్