Breaking News: శ్రీలంక మహిళల జట్టుపై భారత్ విజయం
ABN , First Publish Date - Dec 26 , 2025 | 06:22 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 26, 2025 21:43 IST
శ్రీలంక మహిళల జట్టుపై భారత్ విజయం
మూడో టీ20: శ్రీలంక మహిళల జట్టుపై భారత్ విజయం
SLW జట్టుపై 8 వికెట్ల తేడాతో INDW ఘన విజయం
స్కోర్లు: SLW 112/7, INDW 115/2 (13.2 ఓవర్లలో)
42 బంతుల్లో 79 పరుగులు చేసిన షెఫాలి వర్మ
మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే..
5 టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న భారత్
-
Dec 26, 2025 20:48 IST
BRS ముఖ్య నేతలతో ముగిసిన కేసీఆర్ సమావేశం
ఈనెల 29న అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం
అసెంబ్లీ సమావేశాల తర్వాత BRS బహిరంగ సభలు
తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోంది: కేసీఆర్
తెలంగాణ కోసం BRS తప్ప ఇతర పార్టీలు పోరాడవు: కేసీఆర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహం, అన్యాయాన్ని..
బహిరంగ సభా వేదికలుగా ప్రజలకు వివరిద్దాం: కేసీఆర్
-
Dec 26, 2025 19:35 IST
నేను ఇప్పటికీ బీజేపీ సైనికుడినే: MLA రాజాసింగ్
పార్టీ ఎప్పుడు పిలిచినా చేరేందుకు సిద్ధం: రాజాసింగ్
-
Dec 26, 2025 18:28 IST
తిరుమల పరకామణి చోరీ అంశంపై ఏపీ హైకోర్టు విచారణ
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏసీబీ మధ్యంతర నివేదిక
నిందితుడు రవికుమార్ సహా కుటుంబసభ్యుల ఆస్తులపై నివేదిక
ఏసీబీ నివేదిక పరిశీలించి ఉత్తర్వులు జారీచేస్తామన్న హైకోర్టు
ఎఫ్‌ఐఆర్ నమోదు అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి ఆదేశం
తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా
-
Dec 26, 2025 17:34 IST
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన భారత్
మూకదాడుల్లో ఇద్దరు హిందువుల మృతి బాధాకరం
హిందువుల ఆస్తులనూ ధ్వంసం చేస్తున్నారు: భారత్
దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
-
Dec 26, 2025 17:04 IST
హెచ్ 1 బీ వీసాలపై భారత్ ప్రభుత్వం జోక్యం
అమెరికా ప్రభుత్వంతో కేంద్ర విదేశాంగ శాఖ చర్చలు
తక్షణమే సమస్యను పరిష్కరించాలంటూ అమెరికాకు భారత్ విజ్ఞప్తి
-
Dec 26, 2025 16:13 IST
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
పాఠశాలల్లో వార్తా పత్రికల పఠనం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
విద్యార్థి దశ నుంచే పిల్లల్లో జ్ఞానం పెంపొందించాలంటే కనీసం 10 నిమిషాలు పత్రికా పఠనం చేయాలి
-
Dec 26, 2025 16:12 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
367 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
100 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Dec 26, 2025 15:58 IST
కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను అప్పులపాలు చేసింది: చామల
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను దోచుకున్నారు
BRS హయాంలో దండుపాళ్యం ముఠాలా దోచుకున్నారు: చామల
ప్రజల మేలు కోసమే అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు: చామల
కేటీఆర్.. మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే డబ్బు ఇవ్వడంకాదు
ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తే కోటీశ్వరులుగా మారుతారు: చామల
కేటీఆర్.. రేవంత్‌రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయ్యారు: ఎంపీ చామల
మేనేజ్‌మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కేటీఆర్: చామల
-
Dec 26, 2025 15:19 IST
సిద్దిపేట: ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం
హాజరైన కేటీఆర్, హరీష్‌రావు, ముఖ్యనేతలు
ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు
అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం,..
బహిరంగ సభల తేదీలపై కేసీఆర్ దిశానిర్దేశం
-
Dec 26, 2025 14:00 IST
రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశారు: కేటీఆర్
ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారు: కేటీఆర్
కోటి మందిని కోటీశ్వరులను చేస్తామన్న హామీ ఏమయ్యింది?: కేటీఆర్
రేవంత్ రెడ్డి ఎలా ఎదిగారో అందరికీ తెలుసు: కేటీఆర్
తిట్ల పురాణం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు: కేటీఆర్
తిట్ల భాష మాకు కూడా వచ్చు... కానీ మేం తిట్టం: కేటీఆర్
కేసీఆర్ చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే... వీళ్లు బాంబులతో పేల్చివేశారు: కేటీఆర్
రేవంత్ కిస్మత్ బాగుండి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారు: కేటీఆర్
-
Dec 26, 2025 12:30 IST
కృష్ణా: పామర్రు మండలం నిమ్మకూరులో నారా భువనేశ్వరి
ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించిన భువనేశ్వరి
శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహణ
-
Dec 26, 2025 12:03 IST
గుంటూరు కలెక్టర్ ఆఫీసులో బ్యాంకర్లతో కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష
పద్ధతి మార్చుకోకపోవడంపై HDFC, ICICI, AXIS బ్యాంకులపై పెమ్మసాని సీరియస్
అప్లికెంట్లకు రుణాల మంజూరులో జాప్యం చేస్తున్న అధికారులపై మండిపాటు
గతంలో హెచ్చరించినా బ్యాంకర్ల తీరు మారలేదని పెమ్మసాని అసహనం
రిపీట్ అయితే ప్రభుత్వ డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకులకు మళ్లిస్తామని వార్నింగ్
-
Dec 26, 2025 11:43 IST
ఢిల్లీ: వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా...
రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు అందుకున్న పారా అథ్లెట్ శివాని
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన పారా అథ్లెట్ శివాని
-
Dec 26, 2025 11:43 IST
కృష్ణా: మచిలీపట్నంలో టీడీపీ వర్సెస్ వైసీపీ
పోటాపోటీగా వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాలు
టీడీపీ వర్సెస్ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్తత
మచిలీపట్నంలో ఆంక్షలు విధించిన పోలీసులు
రామానాయుడుపేట పేర్ని నాని కార్యాలయం దగ్గర బందోబస్తు
బారికేడ్లు, అదనపు బలగాలతో భారీగా పోలీసుల మోహరింపు
కూటమి ర్యాలీ పూర్తయ్యే వరకు వైసీపీ ర్యాలీకి అనుమతి నిరాకరణ
పోలీసులతో పేర్ని నాని వాగ్వాదం
-
Dec 26, 2025 11:43 IST
అనంతపురం: మధ్యప్రదేశ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
ఐదు కంట్రీ మేడ్ పిస్తోళ్లు, ఖాళీ మ్యాగజైన్, 30 బుల్లెట్లు, 3 బుల్లెట్ షెల్స్ స్వాధీనం
జిమ్ ఓనర్ రాజశేఖర్‌కు గన్ విక్రయించిన మధ్యప్రదేశ్ ముఠా సభ్యులు
కుటుంబతగాదాలలో కాల్చిపారేస్తానంటూ భార్యను గన్‌తో బెదిరించిన రాజశేఖర్
పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజశేఖర్ భార్య మనీషా
మనీషా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రాజశేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో గన్ కొనుగోలు చేసినట్లు విచారిణలో గుర్తింపు
గ్వాలియర్‌కు వెళ్లి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Dec 26, 2025 11:40 IST
తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి హాజరైన సీఎం చంద్రబాబు
హాజరైన కేంద్రమంత్రి జితేంద్రసింగ్, RSS చీఫ్ మోహన్ భగవత్
తిరుపతిలో ఈనెల 29 వరకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం
భారత్‌లో నాలెడ్జ్‌కు కొదవ లేదు: సీఎం చంద్రబాబు
మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలకపాత్ర: సీఎం చంద్రబాబు
2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుంది: చంద్రబాబు
ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగుతుంది: చంద్రబాబు
దశాబ్దకాలంగా చాలా దేశాల్లో జనాభా వృద్ధి తగ్గుతోంది
భారత్‌లో మాత్రమే జనాభా వృద్ధి జరిగింది: చంద్రబాబు
మోదీ నాయకత్వంలో భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉంది
సౌర, పవన విద్యుత్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాం: చంద్రబాబు
6నెలల్లో అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ ఆపరేట్
క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయడానికి కూడా చర్యలు
అనేక అంతర్జాతీయ సంస్థలు ఏపీకి రాబోతున్నాయి: చంద్రబాబు
-
Dec 26, 2025 11:40 IST
GHMCలో ప్రారంభమైన కొత్త జోన్లు
గ్రేటర్ పరిధి విస్తరించడంతో 12 జోన్లు, 60 సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు
కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్,..
మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్
300 వార్డులతో ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
10వేల అభ్యంతరాలు స్వీకరించి స్వల్ప మార్పులతో ఫైనల్ నోటిఫికేషన్
GHMC పరిధి పెంపు, వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి
కొత్తగా ఏర్పాటైన జోన్లకు హుటాహుటిన జోనల్ కమిషనర్ల నియామకం
12 జోన్లలో 8 జోన్లకు కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులు
-
Dec 26, 2025 10:37 IST
మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన BRS నేతల సమావేశం
పాల్గొననున్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నేతలు
పాలమూరు ఎత్తిపోతల పథకంలో కాంగ్రెస్ నిర్లక్ష్యంపై ప్రజల్లోకి కేసీఆర్
కొత్త ఏడాదిలో బహిరంగ సభలకు సిద్ధమవుతోన్న కేసీఆర్
మూడు జిల్లాల్లో సభల తేదీలను ఖరారు చేసే అవకాశం
-
Dec 26, 2025 10:37 IST
హైదరాబాద్: నల్లకుంటలో దారుణం
భార్యపై అనుమానంతో పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
అడ్డుకున్న కుమార్తెను కూడా మంటల్లోకి తోసేసిన వెంకటేష్
భార్య త్రివేణి మృతి, కుమార్తెకు గాయాలు, నిందితుడు అరెస్ట్
-
Dec 26, 2025 10:32 IST
కెనడా టొరంటోలో భారత విద్యార్థిని కాల్చిచంపిన దుండగులు
స్కార్‌బొరౌగ్ వర్సిటీ దగ్గర శివాంక్ అవస్థి(20)ని కాల్చిచంపిన దుండగులు
హైల్యాండ్ క్రీక్ ట్రెయిల్ వద్ద టొరంటో వర్సిటీలో చదువుతున్న శివాంక్
-
Dec 26, 2025 08:31 IST
గుంటూరు: అంకిరెడ్డిపాలెం సమీపంలో రోడ్డుప్రమాదం
ఆగి ఉన్న కారును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మృతులు తెలంగాణలోని సూర్యాపేట వాసులుగా గుర్తింపు
-
Dec 26, 2025 08:31 IST
కృష్ణా: నేడు నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటన
పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్న భువనేశ్వరి
గ్రామస్తులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న భువనేశ్వరి
-
Dec 26, 2025 07:48 IST
నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
జాతీయ సంస్కృత వర్సిటీలో భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం
పాల్గొననున్న సీఎం చంద్రబాబు, RSS చీఫ్ మోహన్ భగవత్
మధ్యాహ్నం పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు
-
Dec 26, 2025 07:48 IST
నేడు భారత్, శ్రీలంక మహిళా మూడో టీ20
తిరువనంతపురంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్
ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత మహిళల జట్టు
-
Dec 26, 2025 06:22 IST
నంద్యాల: ఆళ్లగడ్డ మం. నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
కారు, ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు మృతి, ఇద్దరికి గాయాలు
డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న CGR ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కారు
మృతులు అందరూ హైదరాబాద్ వాసులుగా గుర్తింపు