Breaking News: నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
ABN , First Publish Date - Dec 24 , 2025 | 07:29 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 24, 2025 12:33 IST
అందుకు నో చెప్పిన హైకోర్టు..
డీజీపీ శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దుకు నిరాకరించిన TG హైకోర్టు
2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును UPSCకి పంపాలని ఆదేశం
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎంపిక ఉండాలన్న హైకోర్టు
ప్యానెల్ లిస్టును పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా
-
Dec 24, 2025 12:11 IST
కాంగ్రెస్ లోనే ఉన్నా: దానం..
నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం: దానం నాగేందర్
MIM సహకారంతో 300 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది: దానం నాగేందర్
-
Dec 24, 2025 11:28 IST
అమరావతి: ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్
వృద్ధురాలు నాగేశ్వరమ్మ ఇంటికి పవన్‌కల్యాణ్
నీ బిడ్డగా ఇంటికి వచ్చానని నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కారం
నాగేశ్వరమ్మ ఆర్థిక పరిస్థితిపై పవన్‌కల్యాణ్ ఆరా
నాగేశ్వరమ్మకు రూ.50వేలు, మనవడికి రూ.లక్ష సాయం
నాగేశ్వరమ్మ మనవడి చదువుకు నెలకు రూ.5 వేలు సాయం
నాగేశ్వరమ్మ కుమారుడికి రూ.3 లక్షల CMRF చెక్ అందజేసిన పవన్
భవిష్యత్‌లో అండగా ఉంటామని నాగేశ్వరమ్మకు పవన్ హామీ
-
Dec 24, 2025 11:27 IST
అమరావతి: కాసేపట్లో రుషికొండపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సమావేశంలో మరోసారి చర్చ
త్వరలో రుషికొండ ప్యాలెస్ వినియోగంపై..
ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న కేబినెట్ సబ్ కమిటీ
-
Dec 24, 2025 09:23 IST
బాహుబలి ప్రయోగం విజయవంతమైంది: ఇస్రో చైర్మన్ నారాయణన్
LVM ప్రయోగాల్లో సంపూర్ణ విజయాలు: ఇస్రో చైర్మన్ నారాయణన్
అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతం చేశాం: నారాయణన్
అమెరికన్ కస్టమర్ కోసం ప్రయోగం చేపట్టాం: ఇస్రో చైర్మన్ నారాయణన్
ప్రపంచంలో అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటి: ఇస్రో చైర్మన్ నారాయణన్
34 దేశాలకు సేవలందిస్తున్న ఇస్రో: చైర్మన్ నారాయణన్
గగన్‌యాన్ కోసం ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది: నారాయణన్
ఇస్రోపై అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాం: ఇస్రో చైర్మన్ నారాయణన్
-
Dec 24, 2025 09:23 IST
LVM-3 M6 బాహుబలి ప్రయోగం విజయవంతం
అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్-2
అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ప్రయోగం
ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4G, 5G సేవలు అందించనున్న బ్లూ బార్డ్ బ్లాక్-2
LVM3 రాకెట్ సిరీస్‌లో ఇది 9వ ప్రయోగం
ఇస్రో చరిత్రలోనే అతి భారీ ఉపగ్రహ ప్రయోగం
-
Dec 24, 2025 09:13 IST
శ్రీహరికోటలో LVM-3 M6 బాహుబలి రాకెట్ ప్రయోగం
కొనసాగుతోన్న మూడో దశ
USకి చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని పంపుతున్న ఇస్రో
-
Dec 24, 2025 09:13 IST
శ్రీహరికోటలో LVM-3 M6 బాహుబలి రాకెట్ ప్రయోగం
తొలిసారి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్న ఇస్రో
బ్లూబర్డ్ బ్లాక్-2 బరువు 6,100 కిలోలు
శ్రీహరికోటలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం
మూడు దశల్లో 15 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తి
-
Dec 24, 2025 08:59 IST
శ్రీహరికోటలో LVM-3 M6 రాకెట్ ప్రయోగం
USకి చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని పంపుతున్న ఇస్రో
తొలిసారి భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్న ఇస్రా
-
Dec 24, 2025 07:30 IST
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు
డిటీసీ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ సోదాలు
15 గంటల పాటు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు
వందకోట్లకుపైగా ఆస్తులు, 3 కిలోల బంగారం గుర్తింపు
నిజామాబాద్, మెదక్, నారాయణఖేడ్‌లో భారీగా ఆస్తులు
కోట్ల విలవైన కమర్షియల్ ప్రాపర్టీస్ గుర్తింపు
స్నేహితుల దగ్గర భద్రపరిచిన డాక్యమెంట్లు స్వాదీనం
వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి కిషన్ తరలింపు
అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్న అధికారులు
-
Dec 24, 2025 07:29 IST
సీఎస్ సమీక్ష
నేడు తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు సమీక్ష
బడ్జెట్‌పై పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం
-
Dec 24, 2025 07:29 IST
నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
కోస్గిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సన్మానం
సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
అనంతరం కొత్త సర్పంచ్‌లతో భోజనం చేయనున్న సీఎం
-
Dec 24, 2025 07:29 IST
నేడు గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ
ఇప్పటికే ముగిసిన టీజీపీఎస్సీతో పాటు గ్రూప్-1 అభ్యర్థుల వాదనలు
ఇవాళ కొనసాగనున్న ప్రతివాదుల తరఫున వాదనలు
-
Dec 24, 2025 07:29 IST
నేడు పులివెందుల నుంచి ఇడుపులపాయకు జగన్
సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న వైఎస్ జగన్
సాయంత్రం ఇడుపులపాయలో వైసీపీ శ్రేణులతో భేటీ
-
Dec 24, 2025 07:29 IST
దర్శనాలకు బ్రేక్
నేడు మేడారంలో సాధారణ భక్తుల దర్శనాలకు బ్రేక్
ఇవాళ పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునఃప్రతిష్ఠ