Share News

Breaking News: నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఆందోళనలు

ABN , First Publish Date - Dec 21 , 2025 | 06:34 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Breaking News: నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఆందోళనలు
Breaking News

Live News & Update

  • Dec 21, 2025 08:01 IST

    హైదరాబాద్‌లో సీఈసీ జ్ఞానేష్‌కుమార్ పర్యటన

    • సాలార్‌జంగ్‌ మ్యూజియం సందర్శించనున్న సీఈసీ

    • సాయంత్రం రవీంద్రభారతిలో BLOలతో సమావేశం

  • Dec 21, 2025 08:01 IST

    ఉత్తర భారత్‌ను కమ్మేసిన పొగమంచు, యూపీకి రెడ్ అలర్ట్

    • హిమాచల్, జమ్మూకశ్మీర్‌లో భారీగా మంచు కురిసే అవకాశం

    • పంజాబ్ హర్యానాలో పెరిగిన చలి తీవ్రత

    • ఢిల్లీలో డేంజర్ లెవల్స్‌కు వాయుకాలుష్యం

  • Dec 21, 2025 08:01 IST

    బంగ్లాదేశ్‌లో కొనసాగుతోన్న ఆందోళనలు

    • ఘర్షణలతో బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ అలర్ట్

    • బంగ్లాదేశ్‌లో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన

    • అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకురావొద్దని హెచ్చరిక

  • Dec 21, 2025 08:00 IST

    కాంగ్రెస్ ఆందోళనలు

    • నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఆందోళనలు

    • జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నిరసన

  • Dec 21, 2025 06:40 IST

    అమరావతి: టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు

    • నేడు జిల్లా అధ్యక్షులను ప్రకటించనున్న టీడీపీ అధిష్టానం

    • సామాజిక సమీకరణలు, సామర్థ్యం, సీనియారిటీ..

    • అనుభవం ఆధారంగా జిల్లా అధ్యక్ష పదవులు

  • Dec 21, 2025 06:40 IST

    ఏపీ వ్యాప్తంగా నేడు పల్స్‌ పోలియో కార్యక్రమం

    • కాకినాడలో ప్రారంభించనున్న మంత్రి సత్యకుమార్

    • 54 లక్షల మందికి పైగా చిన్నారులకు పల్స్‌ పోలియో

    • ఇప్పటికే అన్ని జిల్లాలకు చేరిన 98,99,300 డోస్‌లు

  • Dec 21, 2025 06:40 IST

    నేడు తెలంగాణ భవన్‌కు కేసీఆర్

    • కేసీఆర్ అధ్యక్షతన BRS LP, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం

    • నదీ జలాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమరశంఖం

    • సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమంపై కేసీఆర్ దిశానిర్దేశం

    • BRS LP సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం

  • Dec 21, 2025 06:34 IST

    రంగారెడ్డి: నేడు కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

    • హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం

    • ఉ.8:30కి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి

    • కార్యక్రమానికి హాజరుకానున్న తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

    • కార్యక్రమానికి హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

    • శ్రీరామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు దాజీ ఆధ్వర్యంలో కార్యక్రమం