బర్త్‌డే పార్టీలో రౌడీషీటర్ హత్య..
ABN , First Publish Date - Dec 05 , 2025 | 07:24 AM
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరువాత దాదాపు నాలుగేళ్ళ తరువాత ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Live News & Update
-
Dec 05, 2025 08:38 IST
ఏలూరు: జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం
పెదవేగి మం. అమ్మపాలెంకు చెందిన మహిళకు పాజిటివ్
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళకు చికిత్స
-
Dec 05, 2025 08:38 IST
కృష్ణా: జగ్గయ్యపేట మం. చిల్లకల్లులో రౌడీషీటర్ నవీన్ హత్య
రౌడీషీటర్ పిల్ల సాయి బర్త్‌డే పార్టీలో వివాదం
రౌడీషీటర్లు నవీన్ రెడ్డి, పిల్ల సాయి మధ్య వివాదం
బర్త్‌డే పార్టీ ఘర్షణలో నవీన్‌ను కత్తితో పొడిచిన పిల్లసాయి
నవీన్‌ను ఆస్పత్రికి తరలించి పారిపోయిన పిల్లసాయి అనుచరులు
సోషల్ మీడియాలో పిల్ల సాయి వీడియోలు వైరల్
-
Dec 05, 2025 08:38 IST
ప్రకాశం: పొదిలిలో భూ ప్రకంపనలు
తెల్లవారుజామున 3 గంటలకు 2 సెకన్లపాటు కంపించిన భూమి
పొదిలి, దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో ఇటీవల వరుస భూప్రకంపనలు
-
Dec 05, 2025 07:25 IST
భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన
రాత్రి పుతిన్‌కు విందు ఇచ్చిన ప్రధాని మోదీ
నేడు హైదరాబాద్ హౌజ్‌లో శిఖరాగ్ర సమావేశం
నేడు రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్న పుతిన్
-
Dec 05, 2025 07:25 IST
నేడు నర్సంపేటకు సీఎం రేవంత్ రెడ్డి
రూ.531 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఇంటిగ్రేడెట్ స్కూల్ భవనానికి భూమిపూజ
నీటిపారుదల శాఖపై రేపు సీఎం సమీక్ష
-
Dec 05, 2025 07:25 IST
మన్యం జిల్లాకు చంద్రబాబు..
నేడు మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
పేరెంట్-టీచర్స్ మీటింగ్‌లో పాల్గొననున్న చంద్రబాబు
-
Dec 05, 2025 07:25 IST
రేపు భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో టెస్ట్
రేపు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మ.1:30కు మ్యాచ్
మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమానంగా ఉన్న ఇరుజట్లు
-
Dec 05, 2025 07:24 IST
'అఖండ 2' సినిమా విడుదల వాయిదా
'అఖండ 2' విడుదల వాయిదా వేసినట్లు నిర్మాతల ప్రకటన
అనివార్య కారణాలతో మూవీ విడుదల వాయిదా: 14 రీల్స్ సంస్థ
త్వరలో సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం: నిర్మాణ సంస్థ 14 రీల్స్