ప్రోటోకాల్ బ్రేక్ చేసిన మోదీ
ABN , First Publish Date - Dec 04 , 2025 | 07:39 AM
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు వచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరువాత దాదాపు నాలుగేళ్ళ తరువాత ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Live News & Update
-
Dec 04, 2025 20:08 IST
ప్రొటోకాల్ బ్రేక్ చేసి.. పుతిన్‌కు స్వాగతం పలుకుతున్న మోదీ...
వీడియోను ఇక్కడ చూడండి.. -
Dec 04, 2025 19:28 IST
articleText
-
Dec 04, 2025 19:25 IST
పుతిన్ ను తన కారులో ఎక్కించుకున్న మోదీ
-
Dec 04, 2025 19:22 IST
కీలక పదవుల్లో ఉన్న మనవారిని పుతిన్ కు పరిచయం చేస్తున్న మోదీ
-
Dec 04, 2025 19:20 IST
ఏళ్ల తరువాత ఇండియాకు వచ్చిన పుతిన్ కు స్వాగతం పలుకుతున్న మోదీ
-
Dec 04, 2025 19:19 IST
ఢిల్లీలో రెండోసారి అడుగుపెడుతున్న పుతిన్

-
Dec 04, 2025 19:16 IST
హైసెక్యూరిటీ నడుమ ప్రధాని మోదీ
-
Dec 04, 2025 19:13 IST
పాలం విమానశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం
-
Dec 04, 2025 18:19 IST
ఢిల్లీలో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్
పాలం విమానశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం
ప్రొటోకాల్ పక్కన పెట్టి పుతిన్‌కు ప్రధాని మోదీ స్వాగతం
నాలుగేళ్ల తర్వాత ఇండియా టూర్‌కు పుతిన్
పుతిన్‌కు స్పెషల్ విందు ఇస్తున్న PM మోదీ
రేపు హైదరాబాద్ హౌస్‌లో శిఖరాగ్ర సమావేశం
23వ భారత్ - రష్యా వార్షిక సదస్సుకు హాజరవనున్న పుతిన్
25కు పైగా ఒప్పందాలు చేసుకోనున్న భారత్-రష్యా
ఈ ఏడాది పుతిన్-మోదీ సమావేశమవడం రెండోసారి
-
Dec 04, 2025 18:18 IST
రష్యా రక్షణ మంత్రితో రాజ్ నాథ్ సింగ్ భేటీ
-
Dec 04, 2025 18:09 IST
ఢిల్లీ: కాసేపట్లో భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్
పుతిన్‌కు స్వాగతం పలకనున్న విదేశాంగశాఖ మంత్రి జైశంకర్
రాత్రి 7కి లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోదీతో పుతిన్ డిన్నర్ మీట్
రేపు హైదరాబాద్ హౌస్‌లో శిఖరాగ్ర సమావేశం
భారత్-రష్యా 23వ వార్షిక సదస్సులో పాల్గొననున్న పుతిన్
25కు పైగా ఒప్పందాలు చేసుకోనున్న భారత్-రష్యా
-
Dec 04, 2025 17:39 IST
అఖండ-2 టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
పెంచిన టికెట్ రేట్ల ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో..
20 శాతం మూవీ వెల్ఫేర్ అసోయేషన్‌కు ఇవ్వాలని నిబంధన
ఆ మొత్తాన్ని FDC పర్యవేక్షణలో ప్రత్యేక ఖాతాకు జమచేయాలన్న ప్రభుత్వం
-
Dec 04, 2025 16:44 IST
ఏడాదిలోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం: సీఎం రేవంత్
వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు ఉండాల్సిందే: సీఎం రేవంత్
ఎయిర్‌పోర్టు వస్తే ఆదిలాబాద్‌కు పరిశ్రమలు వస్తాయి: సీఎం రేవంత్
ఎర్రబస్సే కాదు.. ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్సు కూడా తేస్తాం: సీఎం రేవంత్
-
Dec 04, 2025 16:36 IST
ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు
బెయిలు, కస్టడీ పిటిషన్లపై రేపు నాంపల్లి కోర్టు తీర్పు
తీర్పును రిజర్వ్ చేసిన నాంపల్లి కోర్టు
ఐ బొమ్మ రవి నుంచి కీలక సమాచారాన్ని ఇంకా సేకరించాల్సి ఉందని కోర్టుకు తెలిపిన పోలీసుల తరఫున న్యాయవాది
రవి బెయిల్ పిటిషన్ పై కూడా కొనసాగిన వాదనలు
కేసు విచారణ దశలో బెయిల్ మంజూరు చేయవద్దంటూ పోలీసులు న్యాయవాది అభ్యంతరం
4 కేసుల్లో వేర్వేరుగా రవి పైరసీ పట్ల విచారణ చేపట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపిన పీపీ
బెయిలు ,కస్టడీ పిటిషన్ లపై శుక్రవారం తీర్పు వెల్లడి
-
Dec 04, 2025 15:01 IST
మదీనా- హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇండిగో విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది
-
Dec 04, 2025 14:34 IST
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
చెరువులను తలపిస్తున్న పంటపొలాలు
ముత్తుకూరు, తోటపల్లి గూడూరు, వెంకటాచలం మండలాల్లో..
నీట మునిగిన 25,720 ఎకరాల వరినారు, రైతుల ఆందోళన
గూడూరు మండలం తిప్పవరపాడు దగ్గర..
రాపూరు రోడ్డుపై ఉధృతంగా వరదనీరు
గూడూరు-సైదాపురం మధ్య నిలిచిన రాకపోకలు
-
Dec 04, 2025 14:34 IST
కాసేపట్లో ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం బహిరంగ సభలో పాల్గొననున్న రేవంత్
-
Dec 04, 2025 14:33 IST
అమరావతిలో ఎవరూ భూములు కొనొద్దు, అమ్మకూడదని చట్టంలో ఉంది
కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్‌లు చేస్తున్నారు: జగన్
ఉచితం పేరుతో రూ.కోట్ల విలువైన ఇసుక స్కామ్: జగన్
ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు: జగన్
బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి ఫైబర్ నెట్ కట్టబెట్టారు: జగన్
కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేశారు: జగన్
ప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్‌పై చంద్రబాబే సంతకం చేశారు: జగన్
చంద్రబాబు అండ్ కో గోబెల్స్‌ను మించిపోయారు: జగన్
చంద్రబాబుకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెబుతారు: జగన్
-
Dec 04, 2025 13:06 IST
శ్రీసత్యసాయి: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన విద్యార్థి అరెస్ట్
పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన చెన్నెకొత్తపల్లి పోలీసులు
విద్యార్థిని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు, మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు తరలింపు
నవంబర్ 26న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి దాడి చేసిన విద్యార్థి
విద్యార్థిపై ధర్మవరం వన్‌టౌన్, చెన్నెకొత్తపల్లి పోలీసులకు విద్యార్థిని ఫిర్యాదు
పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి
-
Dec 04, 2025 13:06 IST
రైతులకు ఏ పంటకూ మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు: జగన్
మా హయాంలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీలను మూసేశారు
ఈక్రాప్ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారు: జగన్
సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని చంద్రబాబు చెబుతున్నారు: జగన్
అబద్ధాల ప్రచారంలో గోబెల్స్‌ను చంద్రబాబు మించిపోయారు
గోబెల్స్‌కు సీఎం చంద్రబాబు టీచర్: వైఎస్ జగన్
హామీలిచ్చి మోసం చేసినవారిపై చీటింగ్ కేసులు పెట్టాలి: జగన్
నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు ఇస్తామన్నారు.. ఏమైంది?: జగన్
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదు, గోరుముద్ధ పథకాన్ని గాలికొదిలేశారు
ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో ఆహారం బాగోలేదు: వైఎస్ జగన్
కలుషిత ఆహారంతో 29మంది పిల్లలు చనిపోయారు.. ఇది రికార్డు: జగన్
-
Dec 04, 2025 13:06 IST
సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేలా రాష్ట్రంలో పాలన ఉంది: జగన్
ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: జగన్
మా హయాంలో వ్యవసాయాన్ని పండగ చేశాం: జగన్
పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా మార్చారు
19 నెలల చంద్రబాబు పాలనలో 17సార్లు ప్రకృతి వైఫరిత్యాలు వచ్చాయి
తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా రాలేదు: జగన్
తుఫాన్ కంటే ముందే కొనాల్సిన పంటల కొనుగోలు చేయలేదు
రూ.1,100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు ఇవ్వలేదు: జగన్
రైతులకు హక్కుగా ఉన్న పంట బీమా పథకాన్ని రద్దు చేశారు: జగన్
కేజీ అరటిపండ్లు అర్ధ రూపాయంటే రైతులు ఎలా బతకాలి?: జగన్
మా హయాంలో అరటి, చీని రైతుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపాం: జగన్
ఏపీ నుంచి ఢిల్లీ, ముంబైకి రైళ్లలో 3లక్షల టన్నులు ఎక్స్‌పోర్ట్ చేశాం: జగన్
-
Dec 04, 2025 13:05 IST
హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా జీడిమెట్ల పారిశ్రామికవాడలో కేటీఆర్ పర్యటన
నాడు పరిశ్రమలకు రాయతీపై విలువైన భూములు కేటాయించారు
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి: కేటీఆర్
జీడిమెట్ల ప్రాంతంలోని పారిశ్రామికవాడలో..
రూ.75 వేల కోట్లు విలువైన భూములు ఉన్నాయి: కేటీఆర్
రెండేళ్లలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టలేదు: కేటీఆర్
శ్మశాన వాటికలకు కూడా స్థలం లేదు: కేటీఆర్
-
Dec 04, 2025 13:05 IST
తెలంగాణ ఏర్పాటు నుంచి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్..
ఎవరికి కేటాయించారో నిజనిర్ధారణ చేయాలి: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
వందల ఎకరాల భూమి అక్రమ కేటాయింపుల వివరాలు ప్రజలకు తెలియాలి
దొంగే దొంగ దొంగ అని అరవడం అంటే ఇదే: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
-
Dec 04, 2025 11:24 IST
రేణిగుంటకు పవన్
తిరుపతి: రేణిగుంటకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
రోడ్డు మార్గం గుండా చిత్తూరుకు పయనం
-
Dec 04, 2025 11:13 IST
రంగారెడ్డి భూ రికార్డుల ఏడీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కొనసాగుతున్న సోదాలు
6 ప్రదేశాల్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు
కలెక్టర్ కార్యాలయంలో కొంగర్ కలాన్, మహబూబ్‌నగర్, గచ్చిబౌలిలో సోదాలు
-
Dec 04, 2025 10:58 IST
పల్నాడు: సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు అరుణకూమారి ఓవరాక్షన్
రోగులపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వైద్యురాలు
ప్రసవం కోసం వచ్చిన గర్బిణి పట్ల అసభ్య దూషణ
ఉమ్మనీరుతో ఆస్పత్రిలో చేరిన గర్భిణి ఆస్మా (24)
డాక్టర్ మాటలకు మనస్థాపంతో ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన గర్భిణి
పిడుగురాళ్ల ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి ఆస్మా
ప్రైవేట్ ఆస్పత్రిలో గర్భిణి ప్రసవం, తల్లి, బిడ్డ క్షేమం
డాక్టర్ ప్రవర్తనపై గతంలో ఎమ్మెల్యే కన్నా ఆగ్రహం
-
Dec 04, 2025 10:29 IST
అలర్ట్..
పల్నాడు: సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు
జ్వరం, ఒంటి నొప్పులతో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేరిన వృద్ధురాలు
రక్ష పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ లక్షణాలు
సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే ఇద్దరు మృతి
-
Dec 04, 2025 10:28 IST
NIA తనిఖీలు
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు
హర్యానా, బిహార్‌లో 22 చోట్ల NIA తనిఖీలు
-
Dec 04, 2025 10:28 IST
ఏజెన్సీలో అలర్ట్
అల్లూరి: PLGA వారోత్సవాల దృష్ట్యా ఏజెన్సీలో అలర్ట్
పాడేరులో పోలీసుల తనిఖీలు, డ్రోన్లతో సర్వే
-
Dec 04, 2025 08:09 IST
చెన్నై: ప్రముఖ నిర్మాత AVM శరవణన్(85) కన్నుమూత
300కు పైగా చిత్రాలను నిర్మించిన AVM శరవణన్
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో సినిమాలు తీసిన AVM
సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు,..
జెమిని, శివాజీ, లీడర్ సహా పలు సినిమాలు తీసిన AVM శరవణన్
-
Dec 04, 2025 07:41 IST
చోటాపూర్‌లో దారుణహత్య
హైదరాబాద్: రెయిన్‌బజార్ పీఎస్ పరిధి చోటాపూర్‌లో దారుణహత్య
జునైద్(30)ను కత్తితో పొడిచి చంపిన దుండగులు
ఘటనకు ఆర్థిక లావాదేవీలే కారణమని గుర్తించిన పోలీసులు
-
Dec 04, 2025 07:41 IST
ఢిల్లీ: నాలుగో రోజు పార్లమెంట్ సమావేశాలు
వాయుకాలుష్యానికి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన
ఉ.10గంటలకు పార్లమెంట్‌లో ఇండియా కూటమి సమావేశం
పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
-
Dec 04, 2025 07:40 IST
అమరావతి: సీఎం చంద్రబాబు నివాసానికి భవానీపురం బాధితులు
సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా ఇళ్లు కూల్చేశారని బాధితుల ఆవేదన
ఇళ్లు కూల్చివేత వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయన్న బాధితులు
తమ సమస్యలు సీఎం చంద్రబాబుకు వివరిస్తామన్న బాధితులు
-
Dec 04, 2025 07:40 IST
నేడు గరుడ సేవ రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు గరుడ సేవ రద్దు
కార్తీక దీపోత్సవం కారణంగా గరుడ సేవ రద్దు
-
Dec 04, 2025 07:40 IST
మన్యం జిల్లాకు మంత్రి లోకేష్
నేడు పార్వతీపురం మన్యం జిల్లాకు మంత్రి లోకేష్
భామినిలో పార్టీ శ్రేణులతో భేటీకానున్న మంత్రి లోకేష్
-
Dec 04, 2025 07:39 IST
పవన్ పర్యటన
నేడు చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
కొత్తగా నిర్మించిన DDO ఆఫీస్ ప్రారంభించనున్న పవన్
-
Dec 04, 2025 07:39 IST
హైదరాబాద్: చందానగర్‌లో రెచ్చిపోయిన చికెన్ వేస్ట్ మాఫియా
దీప్తిశ్రీనగర్ కాలనీలోని GHMC డంపింగ్ యార్డ్ నుంచి కుళ్ళిన చికెన్ వ్యర్ధాలు తరలింపు
GHMC రెండరింగ్ ప్లాంట్‌కు తరలించకుండా ఏపీకి తరలిస్తున్న ముఠా
GHMC అధికారులకు ముడుపులు చెల్లిస్తూ చికెన్ వేస్టేజ్ అక్రమ రవాణా
భారీ వాహనాల్లో ఏలూరు, భీమవరం చేపల చెరువులకు తరలిస్తున్నట్లు గుర్తింపు
-
Dec 04, 2025 07:39 IST
ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్నతాధికారుల బదిలీలు, నియామకాలు
ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మిన్ జీవీ రవి వర్మ బదిలీ
ప్రధాన కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజినీరింగ్ గా జి. వి.రవివర్మ నియామకం
విజయనగరం జోన్ ఈడీ కె.ఎస్ బ్రహ్మానందరెడ్డి హెడ్ ఆఫీస్‌కు బదిలీ
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మిన్‌గా కే.ఎస్. బ్రహ్మానందరెడ్డి నియామకం