Breaking News: ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ
ABN , First Publish Date - Aug 04 , 2025 | 07:08 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 04, 2025 21:46 IST
ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ
నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ
మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత
అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ
అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ
-
Aug 04, 2025 21:27 IST
ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చూశా: సీఎం చంద్రబాబు
ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే బాధేస్తుంది: సీఎం చంద్రబాబు
భారతీయులపై ట్రంప్ ఆంక్షలు తాత్కాలికమే: సీఎం చంద్రబాబు
అమెరికాలో మనవాళ్లు లేకపోతే వారి పనులు జరగవు: చంద్రబాబు
గతంలో ఆంక్షలు మధ్య హైదరాబాద్‌లో కంపెనీ స్థాపించిన బిల్‌గేట్స్: చంద్రబాబు
-
Aug 04, 2025 20:51 IST
భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరిక
భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తాం: ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతో మంది చనిపోతున్నారు
రష్యా నుంచి చౌకగా భారత్ చమురు కొనుగోలు చేస్తోంది
రష్యాకు భారత్ పూర్తిగా సహకరిస్తోంది: ట్రంప్
ఇప్పటికే భారత్‌పై 25శాతం టారిఫ్ విధించిన ట్రంప్
-
Aug 04, 2025 20:22 IST
ఏలూరు జిల్లా: కుక్కునూరు మండలం చీరవల్లి గ్రామంలో తీవ్ర విషాదం
యార్నం సహస్ర (5)జ్వరం తో మృతి
ఈ రోజు పుట్టినరోజు జరుపుకోవాలసీ ఉండగా మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు
-
Aug 04, 2025 20:17 IST
అమెరికా అణు బెదిరింపుల పట్ల మరింత అప్రమత్తత అవసరం: రష్యా
అణు వ్యాప్తి నియంత్రణపై మేం మరింత శ్రద్ధ వహిస్తాం: రష్యా
ప్రపంచ పరిస్థితులను ఎప్పటికప్పుడు మేం గమనిస్తున్నాం: రష్యా
-
Aug 04, 2025 20:09 IST
కాళేశ్వరం కమిషన్ నివేదికలో కీలక అంశాలు
650 పేజీల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అధ్యయనం చేసి..
60 పేజీల సారాంశాన్ని తయారు చేసిన అధికారుల కమిటీ
కేబినెట్‌కు సమర్పించిన 60పేజీల నివేదికలో 32సార్లు కేసీఆర్,..
19సార్లు హరీష్‌రావు, 5 సార్లు ఈటల పేర్లు ప్రస్తావన
బ్యారేజ్‌ల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందని,..
కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్థిక మంత్రి ఈటల..
తప్పుడు సమాచారం ఇచ్చినట్టు నివేదికలో ప్రస్తావించిన కమిషన్
ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈటలను తప్పుబట్టిన కమిషన్
కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలు సమర్పించారని,..
వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిన కమిషన్
-
Aug 04, 2025 19:58 IST
కమిషన్ నివేదికను ఉన్నది ఉన్నట్టు బయటపెట్టలేదు: నిరంజన్‌రెడ్డి
665 పేజీల నివేదికను 65 పేజీలకు కుదించారు: నిరంజన్‌రెడ్డి
రిపోర్ట్‌ను యథాతథంగా బయటపెట్టాలి: మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి
కమిషన్ నివేదికను న్యాయపరంగా సవాల్ చేయొచ్చు
స్థానిక ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు
-
Aug 04, 2025 19:43 IST
కాళేశ్వరం నివేదికపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత
కేసీఆర్ పేరును 35సార్లు ప్రస్తావించినంత మాత్రాని ఏమీ కాదు
కమిషన్ నివేదికతో కేసీఆర్‌కు ఏమీ కాదు
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే నివేదికను బయటపెట్టారు
నిపుణుల కమిటీ సూచనల మేరకే నిర్మాణాలు జరిగాయి
-
Aug 04, 2025 19:35 IST
హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో డాక్టర్ అరెస్ట్
విదేశాలకు పారిపోయేందుకు డాక్టర్ విద్యుల్లత యత్నం
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
విద్యుల్లతపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ
డాక్టర్ నమ్రతతో కలిసి హైదరాబాద్‌లో సరోగసి, IVFలు చేసిన విద్యుల్లత
డాక్టర్ విద్యుల్లత పేరుపై సృష్టి అనుమతులు తీసుకున్నట్టు గుర్తింపు
-
Aug 04, 2025 19:34 IST
కాళేశ్వరం కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తాం: రేవంత్
అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటాం: రేవంత్
అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం: రేవంత్
-
Aug 04, 2025 19:13 IST
భారీ వర్షంతో అధికారులను అప్రమత్తం చేసిన జలమండలి ఎండీ, ఈడీ.
హాట్‌స్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశం
మ్యాన్‌హోళ్ల మూతలు తెరవొద్దని ప్రజలకు వినతి
రంగంలోకి ఈఆర్‌టీ బృందాలు
రోడ్లపై ఎక్కడా ఓవర్లో ఫ్లోలు జరగకుండా చూడాలి.
నీటి నాణ్యత పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
తదుపరి మూడు రోజులు అందరూ సిబ్బంది అందుబాటులో ఉండాలి.
-
Aug 04, 2025 19:06 IST
మహబూబ్‌నగర్: కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని వార్తలు వస్తున్నాయి
ఒకవేళ అదే జరిగితే నా టికెట్ గల్లంతే: గువ్వల బాలరాజు
గతంలో బీజేపీతోనే పోరాడినవాడిని: గువ్వల బాలరాజు
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే కంటే ముందే నేను చేరాలనుకున్నా
నన్ను కాదని నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ RS ప్రవీణ్‌కు ఇచ్చారు
అది నన్ను చాలా బాధించింది: గువ్వల బాలరాజు
-
Aug 04, 2025 19:02 IST
రేపు తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
మ.12గంటలకు కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రెజెంటేషన్
హరీష్‌రావు ప్రెజెంటేషన్‌ను అన్ని నియోజకవర్గాల్లో..
బహిరంగంగా ప్రదర్శించాలని పార్టీ ఆదేశం
-
Aug 04, 2025 19:02 IST
ఏపీలో PG వైద్య విద్యా ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్ ఖరారు
7 క్లినికల్ సబ్జెక్టుల్లో 15%, నాన్ క్లినికల్ సబ్జెక్టుల్లో 30% రిజర్వేషన్
స్పెషలిస్టుల అవసరాలు, PHC వైద్యుల కోసం ప్రభుత్వం నిర్ణయం
వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనకు ఓకే చెప్పిన సిఎం చంద్రబాబు నాయుడు
-
Aug 04, 2025 18:37 IST
ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ
కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ: సీఎం చంద్రబాబు
లిక్కర్ పాలసీ అంటే ఆదాయం కాదు.. ప్రజల ఆరోగ్యం ముఖ్యం
ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండే లిక్కర్ విక్రయాలతో నష్టం తగ్గించవచ్చు
బార్లలో కూడా గీత వర్గాలకు 10 శాతం షాపులు: సీఎం చంద్రబాబు
-
Aug 04, 2025 18:23 IST
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా
రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపిన గువ్వల బాలరాజు
ఈనెల 9న బీజేపీలో చేరనున్న గువ్వల బాలరాజు
నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న బాలరాజు
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం
త్వరలో బీజేపీలో చేరనున్న అబ్రహం
అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అబ్రహం
-
Aug 04, 2025 17:48 IST
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్
కాళేశ్వరం కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించనున్న రేవంత్
-
Aug 04, 2025 17:24 IST
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్‌లో పలుచోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
షేక్‌పేట్‌లో అత్యధికంగా 7.4 సెం.మీ. వర్షపాతం నమోదు
అసిఫ్‌నగర్ 5.3, ఖైరతాబాద్ 5.8, అమీర్‌పేట 3.4 సెం.మీ. వర్షపాతం
కూకట్‌పల్లి 3.4, రాజేంద్రనగర్ కాప్రాలో 2.9 సెం.మీ. వర్షపాతం నమోదు
హైదరాబాద్‌తో పాటు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Aug 04, 2025 17:08 IST
ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ
ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జీరో టికెటింగ్ విధానం: మంత్రి రాంప్రసాద్
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా ఎక్స్‌ప్రెస్‌లలో పథకం అమలు
-
Aug 04, 2025 16:32 IST
ఓవల్ టెస్టులో భారత్ సంచలన విజయం
ఇంగ్లండ్‌పై 6 పరుగుల తేడాతో భారత్ సంచలన విజయం
స్కోర్లు: భారత్ 224, 396, ఇంగ్లండ్ 247, 367
-
Aug 04, 2025 16:25 IST
కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్ ముందుంచిన మంత్రి ఉత్తమ్
నివేదికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు..
ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆర్ బాధ్యుడని ప్రస్తావించిన ఘోష్ నివేదిక
కేసీఆర్‌తో పాటు హరీష్‌రావును బాధ్యుడిగా చూపిన కమిటీ నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దని నిపుణులు సూచించారని నివేదికలో వెల్లడి
ఉద్దేశపూర్వకంగా నిపుణుల నివేదికను తొక్కిపెట్టారని తేల్చిన కాళేశ్వరం కమిషన్
-
Aug 04, 2025 15:56 IST
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
సచివాలయం పరిసరాల్లో భారీ వర్షం
ఉప్పల్, రామాంతపూర్, నాచారం, తార్నాకలో వర్షం
పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వర్షం
-
Aug 04, 2025 15:39 IST
అమరావతి: కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం
హాజరైన రాంప్రసాద్‌రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యా రాణి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సబ్‌కమిటీలో చర్చ
ఉచిత ప్రయాణం పథకానికి మార్గదర్శకాలు రూపొందిస్తోన్న సబ్‌కమిటీ
పథకం సమర్థవంతంగా అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
'స్త్రీశక్తి' పథకారనికి రేపు ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర
ఈ నెల 15న ' స్త్రీశక్తి'ని లాంఛనంగా ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం
-
Aug 04, 2025 15:25 IST
మరోసారి ACB కోర్టులో రాజ్ కసిరెడ్డి మెమో దాఖలు
బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్ల వివరాలు కోరుతూ రాజ్ కసిరెడ్డి పిటిషన్
డిపాజిట్ స్టేటస్ వివరాలు ఇచ్చేలా ఆదేశించాలని రాజ్ కసిరెడ్డి మెమో
-
Aug 04, 2025 15:20 IST
స్పోర్ట్స్ హబ్ కోచైర్మన్‌గా రామ్‌చరణ్ భార్య ఉపాసన
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
-
Aug 04, 2025 15:01 IST
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ జైలుకెళ్లక తప్పదు: మంత్రి కోమటిరెడ్డి
కాళేశ్వరం ఇంజనీర్ల దగ్గరే రూ.కోట్లు దొరికాయి
కేసీఆర్, హరీష్‌రావు దగ్గర ఎన్ని రూ.కోట్లు ఉన్నాయో?: కోమటిరెడ్డి
బనకచర్లను కట్టనివ్వం..శ్రీశైలంను కాపాడుకుంటాం: కోమటిరెడ్డి
-
Aug 04, 2025 14:23 IST
కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర ఉద్రిక్తత
కన్నెపల్లి పంప్ హౌస్‌ను ముట్టడించిన BRS శ్రేణులు
వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్
BRS శ్రేణులను అడ్డుకున్న పోలీసులు, తోపులాట
-
Aug 04, 2025 13:50 IST
కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం
కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్న కేబినెట్
ఇప్పటికే సచివాలయం చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్
కాళేశ్వరం కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించనున్న సీఎం రేవంత్
-
Aug 04, 2025 13:50 IST
సంగారెడ్డి: కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టిన జగ్గారెడ్డి
2017లో నా దగ్గర డబ్బు లేదు: జగ్గారెడ్డి
సంగారెడ్డిలో రాహుల్ సభకు ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది
ఆ సమయంలో తన భూమి అమ్మి కాంగ్రెస్ నేత జూలకంటి డబ్బులు ఇచ్చారు
ఆ విషయం చెబుతూ కన్నీళ్లు పెట్టిన జగ్గారెడ్డి
మధ్యలోనే ప్రసంగం ఆపి సమావేశం నుంచి వెళ్లిపోయిన జగ్గారెడ్డి
-
Aug 04, 2025 13:28 IST
ఢిల్లీ -విజయవాడ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
ఢిల్లీ రన్‌వేపై ఆగిపోయిన ఎయిరిండియా విమానం
విమానంలో 160 మందికి పైగా ప్రయాణికులు
రన్‌వేపై 3 గంటలుగా విమానంలోనే ప్రయాణికుల అవస్థలు
ఎయిరిండియా విమానంలో అనేకమంది వీవీఐపీలు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం
-
Aug 04, 2025 13:02 IST
ఢిల్లీ -విజయవాడ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
ఢిల్లీ రన్‌వేపై ఆగిపోయిన ఎయిరిండియా విమానం
విమానంలో 160 మందికి పైగా ప్రయాణికులు
రన్‌వేపై 3 గంటలుగా విమానంలోనే ప్రయాణికుల అవస్థలు
ఎయిరిండియా విమానంలో అనేకమంది వీవీఐపీలు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం
-
Aug 04, 2025 10:04 IST
జార్ఖండ్ మాజీ సీఎం శిబూసోరెన్(81) కన్నుమూత
ఢిల్లీ గంగారాం ఆస్పత్రిలో శిబూసోరెన్ తుదిశ్వాస
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శిబూసోరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన శిబూసోరెన్
-
Aug 04, 2025 10:04 IST
తమిళనాడు తిరుత్తణి దగ్గర రోడ్డుప్రమాదం
లారీని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి
మృతులు: అన్నమయ్య జిల్లా పీలేరు మాజీ సర్పంచ్ హుమయున్ సహా ఆయన కుమారుడు, సోదరుడు
చెన్నై ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్తుండగా ఘటన
-
Aug 04, 2025 09:43 IST
సీఎం రేవంత్‌కు మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కౌంటర్
రెండు రోజులక్రితం సోషల్ మీడియాపై సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కౌంటర్
సీఎం రేవంత్ వ్యాఖ్యలను తప్పుబడుతూ 'ఎక్స్'లో రాజగోపాల్‌రెడ్డి ట్వీట్
సోషల్ మీడియాను పాలకులు అవమానించడం సరికాదు: రాజగోపాల్‌రెడ్డి
తెలంగాణ సమాజం ఆకాంక్షల కోసం సోషల్ మీడియా పనిచేస్తోంది: రాజగోపాల్‌రెడ్డి
నిబద్ధదతో పనిచేస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు: రాజగోపాల్‌రెడ్డి
సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియాను ఎగదోయడం విభజించి పాలించడమే: రాజగోపాల్‌రెడ్డి
విభజించి పాలించే కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు: రాజ్‌గోపాల్
-
Aug 04, 2025 07:26 IST
ఓటర్ల జాబితా సవరణపై చర్చ
ఉ.11 గంటలకు పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం
బిహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాల పట్టు
-
Aug 04, 2025 07:26 IST
తిరుమలలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు
నేడు అంకురార్పణతో ప్రారంభంకానున్న ఉత్సవాలు
రేపటి నుంచి 7 వరకు పలు ఆర్జిత సేవలు రద్దు
-
Aug 04, 2025 07:26 IST
విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
లిక్కర్ స్కాం కేసు నిందితులు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై విచారించనున్న ACB కోర్టు
ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ పైనా నేడు ACB కోర్టు విచారణ
నిందితుల బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయనున్న సిట్
-
Aug 04, 2025 07:25 IST
అమరావతి: ఉ.11.30 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు
సా.5.30 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి ఏపీ సీఎం చంద్రబాబు
మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభలో పాల్గొననున్న చంద్రబాబు
-
Aug 04, 2025 07:25 IST
నెల్లూరు: లిక్కర్ స్కాం కేసులో నేడు అనిల్‌కుమార్ యాదవ్ విచారణ
టీడీపీ MLA ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో A2గా అనిల్ యాదవ్
గతంలో ప్రసన్నకుమార్‌రెడ్డి అసభ్య వ్యాఖ్యలను సమర్థించిన అనిల్ యాదవ్
ఇప్పటికే అనిల్‌కుమార్ యాదవ్‌కు రెండుసార్లు కోవూరు పోలీసుల నోటీసులు
-
Aug 04, 2025 07:08 IST
ఉత్తరాదిలో వర్ష బీభత్సం
ఎడతెరిపిలేని వర్షాలతో గంగా, యమునా నదుల ఉధృతి
యూపీలో ప్రమాదకరస్థాయి దాటి నదుల ప్రవాహం
ప్రయాగ్‌రాజ్, వారణాసిలో ఇళ్లల్లోకి చేరిన వరద
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
బెంగాల్, బిహార్, అసోం, కేరళకు భారీ వర్షసూచన
హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపిలేని వర్షాలు
-
Aug 04, 2025 07:08 IST
సృష్టి ఫెర్టిలిటీ కేసులో కొనసాగుతున్న విచారణ
ఐవీఎఫ్ సెంటర్లలో కొనసాగుతున్న తనిఖీలు
నేడు చివరిరోజు డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ
విచారణలో పలు కీలక విషయాలు రాబట్టిన పోలీసులు
అసోం చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో నమ్రతకు సంబంధాలు
నమ్రతపై కొత్త FIRలు నమోదు చేస్తున్న పోలీసులు
అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టిన డాక్టర్ నమ్రత