Summer Tour: వేసవిలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను మాత్రం మిస్ అవ్వొద్దు..

ABN, Publish Date - May 05 , 2025 | 06:55 AM

వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చల్లని ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. అలాగే గత మార్చి, ఏప్రిల్‌లో నెలల్లో వివాహమైన వారు కూడా హనీమూన్‌కు అనువైన ప్రాంతాల కోసం వెతుకుతుంటారు.

Summer Tour: వేసవిలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను మాత్రం మిస్ అవ్వొద్దు.. 1/6

వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చల్లని ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. అలాగే గత మార్చి, ఏప్రిల్‌లో నెలల్లో వివాహమైన వారు కూడా హనీమూన్‌కు అనువైన ప్రాంతాల కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారి కోసం ఇండియాలోని కొన్ని అందమైన, ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Summer Tour: వేసవిలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను మాత్రం మిస్ అవ్వొద్దు.. 2/6

కేరళలోని మున్నార్ ప్రాంతం అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రాంతం మొత్తం కొండలు, పచ్చని తేయాకు తోటలతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది. అలాగే ఇక్కడి జలపాతాలు, పొగమంచుతో నిండిన లోయలు చూపరులను కట్టిపడేస్తాయి.

Summer Tour: వేసవిలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను మాత్రం మిస్ అవ్వొద్దు.. 3/6

హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వత శ్రేణుల మధ్యలో ఉన్న ఒక అందమైన నగరం ధర్మశాల. ఈ ప్రాంతం కూడా హనీమూన్‌కు బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది దలైలామా నివాసం ఉన్న ప్రదేశం. జలపాతం, పచ్చని అడవులతో నిండిన ఈ ప్రాంతం పర్యాటకులకు అద్భుతమైన అనుభవం కలిగిస్తాయి.

Summer Tour: వేసవిలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను మాత్రం మిస్ అవ్వొద్దు.. 4/6

కేరళలోని తేక్కడి ప్రాంతం దట్టమైన అడవులు, వన్యప్రాణులతో నిండి ఉంటుంది. కొత్తగా వివాహమైన వారు హనీమూన్‌కు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడికి వచ్చే జంటలకు పెరియార్ సరస్సులో పడవ ప్రయాణం వింత అనుభూతిని కలిగిస్తుంది.

Summer Tour: వేసవిలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను మాత్రం మిస్ అవ్వొద్దు.. 5/6

సిక్కింలోని పెల్లింగ్ ప్రాంతం హనీమూన్‌కు ప్రశాంతమైన ప్రదేశం. ఈ నగరంలోని చల్లని వాతావరణం, ఇక్కడి అందమైన మఠాలు, జలపాతాలు.. పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అన్ని సీజన్లకు ఈ ప్రాంతం అనువుగా ఉండడంతో పాటూ ఇక్కడి హోటళ్లు, రిసార్ట్‌లు బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటాయి.

Summer Tour: వేసవిలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను మాత్రం మిస్ అవ్వొద్దు.. 6/6

తమిళనాడులోని ఊటీ కూడా వేసవి టూర్‌కు బెస్ట్ ఛాయిస్. ఇక్కడి ఉద్యానవానాల్లోని వివిధ రకాల మొక్కలు, ప్రపంచంలోనే పెద్ద గులాబీ తోటలు, ఎత్తుగా ఉండే అందమైన శిఖరాలు, జలపాతాలు తదితరాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

Updated at - May 05 , 2025 | 06:55 AM