Most Faithful Animals: కుక్కల కంటే విశ్వాసంగా ఉండే.. ఈ 5 జంతువుల గురించి తెలుసా..

ABN, Publish Date - Nov 16 , 2025 | 08:59 PM

విశ్వాసం అంటేనే మొదటగా గుర్తొచ్చేది కుక్క. అందుకు తగ్గట్టుగానే కుక్కలు కూడా మనుషుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి. దీంతో అనాదిగా మనిషికి, కుక్కకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అయితే..

Most Faithful Animals: కుక్కల కంటే విశ్వాసంగా ఉండే.. ఈ 5 జంతువుల గురించి తెలుసా.. 1/6

విశ్వాసం అంటేనే మొదటగా గుర్తొచ్చేది కుక్క. అందుకు తగ్గట్టుగానే కుక్కలు కూడా మనుషుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి. దీంతో అనాదిగా మనిషికి, కుక్కకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. అయితే కుక్కల కంటే విశ్వాసమైన జంతువులు ఉన్నాయని మీకు తెలుసా. అవును మీరు విన్నది నిజమే.. కుక్కల కంటే ఎంతో విశ్వాసం ప్రదర్శించే జంతువులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Most Faithful Animals: కుక్కల కంటే విశ్వాసంగా ఉండే.. ఈ 5 జంతువుల గురించి తెలుసా.. 2/6

డాల్ఫిన్లు కూడా ఎంతో తెలివైన సముద్ర జీవులు. ఇవి కూడా మనుషులను ఎంతో అభిమానిస్తాయట. ఈతగాళ్లు మునిగిపోయే సమయంలో ఇవి సాయం చేస్తాయట. డాల్ఫిన్లు మనుషుల భావోద్వేగాలను బాగా అర్థం చేసుకుంటాయని పరిశోధనల్లో తేలింది.

Most Faithful Animals: కుక్కల కంటే విశ్వాసంగా ఉండే.. ఈ 5 జంతువుల గురించి తెలుసా.. 3/6

గుర్రం విశ్వాసానికి మారుపేరుగా పిలుస్తారు. కొన్ని శతాబ్దాలుగా.. గుర్రాలు మనుషులతో కలిసిపోయాయి. యుద్ధంలో, వ్యవసాయంలో, ప్రయాణంలో ఇలా మానవ జీవితంలో గుర్రాలకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. గుర్రం ఒకసారి తన యజమానితో బంధం ఏర్పరచుకుంటే.. అప్పటి నుంచి అతని ప్రతి ఆజ్ఞనూ పాటిస్తుంటుంది. ప్రమాద సమయంలోనూ గుర్రం తన యజమానికి విడిచిపెట్టదట. ఇవి కుక్కల కంటే ఎంతో తెలివైన జంతువులు.

Most Faithful Animals: కుక్కల కంటే విశ్వాసంగా ఉండే.. ఈ 5 జంతువుల గురించి తెలుసా.. 4/6

ఏనుగులకు ఎంతో బలమైన జ్ఞాపక శక్తి ఉంటుందట. కొన్నేళ్ళ తర్వాత కనిపించినా ఇవి మనుషులను గుర్తుపడతాయి. అడవుల్లో పెద్ద పెద్ద వృక్షాలు, వస్తువులను తీసుకెళ్లడం వంటి పనులు చేయడం ద్వారా ఇవి మనిషికి సాయం చేస్తూ వస్తున్నాయి. వాటిని ప్రేమగా చూసుకునే వారి పట్ల అవి జీవితాంతం విశ్వాసంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Most Faithful Animals: కుక్కల కంటే విశ్వాసంగా ఉండే.. ఈ 5 జంతువుల గురించి తెలుసా.. 5/6

రాబందులకు మనుషులు దూరంగా ఉన్నా కూడా.. అవి మనిషితో స్నేహపూర్తకంగా ఉండేందుకు ఇష్టపడతాయట. పెంపుడు రాబందులు.. తమ యజమానుల పట్ల ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాయి. కుక్కల మాదిరే.. ఇవి కూడా తమ యజమానుల కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటాయట. కుక్కలు ఎలాగైతే నేలపై ఉంటూ తమ యజమానులను కాపాడతాయో.. రాబందులు ఆకాశంలో ఎగురుతూ తమ యజమానులు రక్షణగా ఉంటాయి.

Most Faithful Animals: కుక్కల కంటే విశ్వాసంగా ఉండే.. ఈ 5 జంతువుల గురించి తెలుసా.. 6/6

ఒంటెలు కూడా మనుషులతో ఎంతో ప్రేమగా ఉంటాయి. ఇవి తక్కువ నీరు తాగడమే కాకుండా భారీ బరువులను మోస్తాయి. ఒక్కసారి అవి మనుషులతో అనుబంధం ఏర్పరచుకుంటే.. జీవితాంతం అంతే విశ్వాసంగా ఉంటాయి. కష్ట సమయాల్లోనూ ఒంటెలు తమ యజమానుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయట.

Updated at - Nov 16 , 2025 | 08:59 PM