Bus Travel Safety: బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

ABN, Publish Date - Nov 05 , 2025 | 07:47 AM

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. రోడ్డు ప్రమాదాలు చూస్తే మన రహదారులు కాస్తా మృత్యు ద్వారాలుగా కనిపిస్తున్నాయి. రోడ్లపై నడుచుకుంటూ పోయినా, బైక్, ఆటో, ప్రైవేట్ లేదా ప్రభుత్వ బస్సు, రైలు, విమానల్లో ప్రయాణం చేసిన మన ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోతోంది. అయితే బస్సుల్లో ప్రయాణిస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Bus Travel Safety: బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! 1/7

స్లీపర్ బస్సుల్లో అధిక దూరం ప్రయాణించే వారు.. ఆ బస్సు రివ్యూ, రేటింగ్ చూసుకొని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఆ ట్రావెల్స్ గతచరిత్ర తెలుసుకోవాలి.

Bus Travel Safety: బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! 2/7

బస్సులో 35 నుంచి 40 బెర్తులు ఉంటాయి. మధ్యలో ఉన్న దారిలో ఒక్క మనిషి మాత్రమే పట్టే ఖాళీ ఉంటుంది. వీలైనంతవరకు కింది బెర్తుల్లో సీట్ల ఎంపిక ఉత్తమం.

Bus Travel Safety: బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! 3/7

బస్సులు ఆగినప్పుడు, ఏవైనా శబ్దాలు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తక్షణమే స్పందించాలి. ఎవరి సాయం కోసమో చూడకుండా క్షణాల్లో బయటకు రావాలి.

Bus Travel Safety: బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! 4/7

బస్సు బయల్దేరిన సమయం, గమ్యస్థానం, డ్రైవర్ వివరాలు, లొకేషన్ వివరాలను సన్నిహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయాలి. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లపై అవగాహన ఉండాలి.

Bus Travel Safety: బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! 5/7

బస్సుల్లో అగ్ని ప్రమాదం జరిగితే సాధారణ బస్సుల కంటే ఏసీ బస్సుల్లో మంటలు, పొగ వేగంగా వ్యాపిస్తాయి. అందుకే వీలుని బట్టి సాధారణ బస్సులను ఎంపిక చేసుకోవాలి.

Bus Travel Safety: బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! 6/7

బస్సుల్లో అగ్నిమాపక పరికరాల వివరాలు తెలుసుకోవాలి. వాటి వినియోగం, ప్రమాదం సంభవిస్తే ఎలా స్పందించాలో ముందే అవగాహన పెంచుకోవాలి.

Bus Travel Safety: బస్సులో ప్రయాణిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! 7/7

ఒకవేళ బస్సుల్లో ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవ్వకపోతే వెంటనే అద్దాలు, బస్సు డోర్లు పగలగొట్టడం వంటివి చేయాలి.

Updated at - Nov 05 , 2025 | 07:47 AM