Sleeping Problems: తక్కువగా నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు మీకూ రావొచ్చు..
ABN, Publish Date - Aug 09 , 2025 | 08:08 PM
ప్రతి ఒక్కరికీ రోజుకు 6 నుంచి 8గంటల మేర నిద్ర అవసరం. అయితే చాలా మంది వివిధ రకాల కారణాలతో చాలా తక్కువ సమయం నిద్రపోతుంటారు. దీనివల్ల ..
1/6
ప్రతి ఒక్కరికీ రోజుకు 6 నుంచి 8గంటల మేర నిద్ర అవసరం. అయితే చాలా మంది వివిధ రకాల కారణాలతో చాలా తక్కువ సమయం నిద్రపోతుంటారు. దీనివల్ల ప్రారంభంలో ఎలాంటి సమస్యలు లేకున్నా.. రాను రాను అనేక వ్యాధులు సోకడానికి కారణమవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2/6
తగినంత నిద్ర లేకపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అలాగే మానసిక, శారీరక సమస్యలను కలిగిస్తుంది.
3/6
రోజూ సరిపడా నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది చివరకు గుండెపోటుకు కారణం కావొచ్చు. అలాగే శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గి.. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తద్వారా డయాబెటిస్ ప్రమాదం కూడా పెరుగుతుంది.
4/6
నిద్ర సరిగా లేకపోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. తద్వారా బరువు పెరగడంతో పాటూ ఊబకాయ సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. మరోవైపు చర్మ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలు, మొటిమలు పెరిగిపోతాయి.
5/6
నిద్రలేమి వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. రోజంతా అలసట, చిరాకు, మెదడు పనితీరు క్షీణించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. క్రమంలో జ్ఞాపకశక్తి కూడా దెబ్బతింటుంది.
6/6
రోజూ తగినంత నిద్రపోవడంతో పాటూ ధ్యానం యోగా చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా ఉంచాలి. అలాగే రాత్రి వేళల్లో కాఫీ, టీ తదితర కెఫిన్ పానీయాలను తాగకూడదు.
Updated at - Aug 09 , 2025 | 08:08 PM