Women’s World Cup: మీ విజయంతో భారతావని యావత్తూ పులకరించిపోతోంది..

ABN, Publish Date - Nov 03 , 2025 | 08:52 AM

భారత మహిళల క్రికెట్‌ జట్టు సాధించిన విజయంతో భారతావని యావత్తూ పులకరించిపోతోంది. గతంలో రెండు పర్యాయాలు ఫైనల్‌కు వచ్చి ఉసూరుమనిపించినా.. ఈసారి వన్డే విశ్వకప్‌లో ఆఖరి పంచ్‌ మనమ్మాయిలదే..! టోర్నీ నాకౌట్‌ ముందు వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మనమ్మాయిలు అసలు సిసలైన మ్యాచ్‌ల్లో మాత్రం సివంగుల్లా విజృంభించారు.

Women’s World Cup: మీ విజయంతో భారతావని యావత్తూ పులకరించిపోతోంది.. 1/6

ఉత్కంఠభరితంగా సాగిన మహిళల వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో నెగ్గిన హర్మన్‌ప్రీత్‌ సేన మొట్టమొదటిసారిగా విశ్వక్‌పను అందుకుంది.

Women’s World Cup: మీ విజయంతో భారతావని యావత్తూ పులకరించిపోతోంది.. 2/6

భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కోట్లాది క్రీడాభిమానుల కోరిక ఫలించిన వేళ.. వన్డే వరల్డ్‌క్‌పలో భారత జట్టు నయా చాంపియన్‌గా నిలిచింది.

Women’s World Cup: మీ విజయంతో భారతావని యావత్తూ పులకరించిపోతోంది.. 3/6

భారత మహిళల క్రికెట్‌ చరిత్రలోనే చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. మన మహిళల క్రికెట్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో వన్డే విశ్వకప్‌ను హర్మన్‌ బృందం సగర్వంగా ముద్దాడి.. కోట్లాది అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఎన్నో అవమానాలను తట్టుకుంటూ భారత మహిళల క్రికెట్‌ జట్టు సాధించిన పురోగతికి నిదర్శనం ఈ అద్భుత విజయం.

Women’s World Cup: మీ విజయంతో భారతావని యావత్తూ పులకరించిపోతోంది.. 4/6

సెమీస్‌లో ప్రపంచ రికార్డు ఛేదనను తిరగరాసి సమరోత్సాహంతో ఫైనల్లోకి అడుగుపెట్టగా.. టైటిల్‌ ఫైట్‌లోనూ పట్టు చేజారనీయలేదు. ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బ్యాట్‌తో.. బంతితో సఫారీలపై పిడుగల్లే పడింది.

Women’s World Cup: మీ విజయంతో భారతావని యావత్తూ పులకరించిపోతోంది.. 5/6

మన మహిళల క్రికెట్‌లో ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో వన్డే విశ్వకప్‌ను హర్మన్‌ బృందం సగర్వంగా ముద్దాడి.. కోట్లాది అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.

Women’s World Cup: మీ విజయంతో భారతావని యావత్తూ పులకరించిపోతోంది.. 6/6

సెమీస్‌లో ప్రపంచ రికార్డు ఛేదనను తిరగరాసి సమరోత్సాహంతో ఫైనల్లోకి అడుగుపెట్టగా.. టైటిల్‌ ఫైట్‌లోనూ పట్టు చేజారనీయలేదు. ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బ్యాట్‌తో.. బంతితో సఫారీలపై పిడుగల్లే పడింది. ఇక అనూహ్య రీతిలో జట్టులోకి వచ్చిన యువ సంచలనం షఫాలీ వర్మ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లోనూ అదరగొట్టింది.

Updated at - Nov 03 , 2025 | 08:59 AM