చేపల ఇగురు ఇలా చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది..
ABN, Publish Date - Jan 09 , 2025 | 10:24 AM
చేపల ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి కాస్త నూనె వేయాలి. నూనె వేడెక్కాక చేప ముక్కలు వేసి రెండు వైపులా వేయించాలి.

ముందుగా చేపల ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

స్టవ్‌పై పెనం పెట్టి కాస్త నూనె వేయాలి. నూనె వేడెక్కాక చేప ముక్కలు వేసి రెండు వైపులా వేయించాలి.

మిక్సీ జార్లో ధనియాలు, అల్లం తురుము, పసుపు, కారం, ఉప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

స్టవ్ మీద కళాయిని పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి.

తరువాత బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్టును వేసి బాగా కలుపుకోవాలి. ఇగురులా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలను వేయాలి.

నూనె పైకి తేలుతుందంటే ఇగురు రెడీ అయినట్టే. పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన చేపల ఇగురు రెడీ.
Updated at - Jan 09 , 2025 | 06:37 PM