Health Tips: ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నీళ్లు తాగితే జరిగేది ఇదే..
ABN, Publish Date - Jul 06 , 2025 | 09:00 AM
ప్రతి కూరలోనూ ఉపయోగించే పదార్థాలలో కరివేపాకు ఒకటి. కరివేపాకు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ..

ప్రతి కూరలోనూ ఉపయోగించే పదార్థాలలో కరివేపాకు ఒకటి. కరివేపాకు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీళ్లు తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కరివేపాకు నీరు సాయం చేస్తుంది. తద్వారా మధుమేహంతో బాధపడేవారికి మేలు జరుగుతుంది.

శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ఈ నీరు బాగా పని చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

కరివేపాకు నీటిని రోజూ తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

కరివేపాకు నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో పాటూ గ్యాస్, మలమద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు.. చర్మానికి, జుట్టు ఆరోగ్యానికి సహకరిస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Updated at - Jul 06 , 2025 | 09:00 AM