Best Camera Phones: బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..! రూ.25000 లోపు..
ABN, Publish Date - Oct 29 , 2025 | 06:51 AM
ప్రస్తుత ప్రపంచంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఫోన్ వాడటం అనేది చిన్న, పెద్ద వారికి ఒక వ్యసనం లాగా మారిపోయింది. అయితే కంపెనీలు కూడా.. బడ్జెట్ ధరలోనే ఫోన్లను అందించేందుకు పోటీ పడుతున్నాయి. కాగా, ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్స్‌లో ఉండే కెమెరాను చూసి కొనుగోలు చేస్తుంటారు. ఆ కెమెరాతో.. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్‌లో ఫోటోలు, వీడియోలు తీయాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంచి కెమెరా ఉన్న స్మోర్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రూ.25,000 బడ్జెట్ లోపు లభిస్తున్న బెస్ట్ కెమెరా ఉన్న ఫోన్స్ ఏంటో చూద్దాం..
1/6
రెడ్‌మీ నోట్ 14 ప్రోలో 50MP సోనీ IMX సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఏ లైట్ కండిషన్‌లోనైనా ఇది తేటగా, స్పష్టంగా ఫోటోలు అందిస్తుంది. దీనిలోని AI Image Enhancement ఫీచర్ రంగుల డైనమిక్స్‌ను బలోపేతం చేస్తుంది. సెల్ఫీల కోసం 20MP ఫ్రంట్ కెమెరా సూపర్ క్లారిటీని అందిస్తుంది. వీడియోల విషయంలో ఇది 4K రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది.
2/6
పోకో ఎక్స్7 ప్రో 50MP + 8MP డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లోని IMX882 ప్రైమరీ సెన్సార్ తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఫ్రంట్‌లో 16MP లెన్స్ ఉండటంతో సెల్ఫీలు, వ్లాగ్‌లు తీయడానికి ఇది ఉత్తమ ఎంపిక. ఈ ఫోన్ ఫోటోగ్రఫీతో పాటు లాంగ్ యూజ్‌కి కూడా సరిపోతుంది. 4K వీడియో రికార్డింగ్‌తో పాటు, పోర్ట్రైట్ మోడ్‌లో బోకే ఎఫెక్ట్స్ ఆకర్షణీయంగా ఉంటాయి.
3/6
డిజైన్, కెమెరా రెండింటినీ ఇష్టపడే యూజర్లకు Nothing Phone 3a సరైన ఎంపిక. ఇది 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్‌తో వస్తుంది. గ్లైఫ్ లైట్ ఎఫెక్ట్స్ ఫోటో షూట్ సమయంలో అదనపు లైట్‌ను అందిస్తాయి. ఫ్రంట్‌లో 32MP హై-రిజల్యూషన్ సెల్ఫీ కెమెరా ఉండటంతో వీడియో కాల్స్, రీల్స్ షూట్స్ సూపర్ క్వాలిటీగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఉన్న నేచురల్ స్కిన్ టోన్ ప్రాసెసింగ్ ఫీచర్ ఫోటోలను రియలిస్టిక్‌గా చూపిస్తుంది.
4/6
శాంసంగ్ గెలాక్సీ ఎం17, 50MP OIS సెన్సార్‌తో వస్తుంది. తక్కువ కాంతి పరిస్థితుల్లోనూ స్పష్టమైన ఫోటోలు తీయగలిగే నైట్ మోడ్ ఈ ఫోన్ ప్రత్యేకత. వీడియో రికార్డింగ్ లోనూ EIS, OIS రెండింటి కలయికతో స్మూత్ అవుట్‌పుట్ లభిస్తుంది. శాంసంగ్ AI Scene Optimizer ఫీచర్ ఆటోమేటిక్‌గా లైట్, కాంట్రాస్ట్, స్యాచురేషన్‌ను సర్దుబాటు చేస్తుంది.
5/6
ఈ ఫోన్‌లో 50MP సామ్‌సంగ్ HP3 సెన్సార్, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. 50MP మోడ్‌లో తీసిన ఫోటోలు ప్రింట్ సైజ్‌లో కూడా నాణ్యత కోల్పోకుండా ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 32MP ఉండటంతో ఇది సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు బాగా సరిపోతుంది. స్మార్ట్ AI కలర్ ట్యూనింగ్ ఫీచర్ రంగులను సహజంగా ఉంచి లైఫ్‌లైక్ ఫోటోలను ఇస్తుంది.
6/6
iQOO Z10 5G స్మార్ట్‌ఫోన్ 64MP OIS ప్రైమరీ కెమెరాతో వస్తుంది. దీనిలోని Vivo V-Series Image Processor ఫోటోలు, వీడియోలను మరింత బాగా చూపిస్తుంది. 16MP ఫ్రంట్ కెమెరా AI ఫిల్టర్లు, బ్యూటీ మోడ్‌లతో యువతను ఆకట్టుకుంటోంది.
Updated at - Oct 29 , 2025 | 06:58 AM