Vietnam: వియత్నాంలో 9వ శతాబ్దపు ఏకశిలా ఇసుకరాయి శివలింగం
ABN, Publish Date - May 04 , 2025 | 03:34 PM
వియత్నాం దేశం ప్రాచీన కాలంలో హిందూ మతం, భారతీయ సంస్కృతిచే ప్రభావితమైన దేశం. ఇక్కడ అనేక చాం దేవాలయాలు ఉన్నాయి. వీటిని ప్రధానంగా చంపా రాజ్యం (2వ శతాబ్దం CE - 1832) కాలంలో నిర్మించారు.
1/7
వియత్నాం ఆగ్నేయ ఆసియాలోని దేశం. జనాభా దాదాపు పదిన్నర కోట్లు. చదరపు కిలోమీటరుకు దాదాపు 328 మంది జనాభా సాంద్రత ఉంది.
2/7
వియత్నాంకు ఉత్తరాన చైనా, వాయవ్యాన లావోస్, నైరుతిన కాంబోడియా, తూర్పు దిక్కున మలేషియా, ఫిలిప్ఫీన్స్, ఇండోనేషియా సరిహద్దులు.
3/7
(2వ శతాబ్దం CE - 1832) కాలంలో వియత్నాం.. చంపా రాజ్య పాలనలో ఉండేది. వియత్నాంలో అనేక చాం దేవాలయాలు ఉన్నాయి.
4/7
వీటిని ప్రధానంగా చంపా రాజ్య (2వ శతాబ్దం CE - 1832) కాలంలో నిర్మించారు. వీళ్లంతా హిందూ మతం, భారతీయ సంస్కృతిచే ప్రభావితమయ్యారు.
5/7
ప్రత్యేకమైన వాస్తుశిల్పం, సంక్లిష్టమైన ఇటుక పని కలిగి ఉన్న ఈ దేవాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి.
6/7
వియత్నాంలోని చాం ఆలయ సముదాయంలో తాజాగా 9వ శతాబ్దపు ఏకశిలా ఇసుకరాయి శివలింగం బయటపడింది.
7/7
చాం దేవాలయాలు చంపా రాజ్యం యొక్క వారసత్వం, ఇది శతాబ్దాలుగా మధ్య, దక్షిణ వియత్నాంలో అభివృద్ధి చెందిన శక్తివంతమైన నాగరికత.
Updated at - May 04 , 2025 | 03:50 PM