శివయ్య దర్శనానికి.. ఆలయాలు ముస్తాబు
ABN, Publish Date - Feb 25 , 2025 | 09:32 PM
మహాశివరాత్రి పర్వదినాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పలు శివాలయాలు ముస్తాబవుతున్నాయి. రేపు(బుధవారం) శివరాత్రి సందర్భంగా నూతన కళను సంతరించుకున్నాయి. భారీ సెట్టింగ్స్‌తో ఆలయాల్లో ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి .
1/16
విద్యుత్ వెలుగుల్లో నల్గొండలో గల పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వరాలయం
2/16
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం శివగంగ దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
3/16
మహా శివరాత్రి రోజున శివాభిషేకం చేస్తే శివ కటాక్షం లభిస్తుందని భక్తులు చెబుతున్నారు.
4/16
కోరిన వరాలను తీర్చే పరమ శివుడు ఈ శివరాత్రి రోజున శివనామ స్మరణతో మార్మోగే వేళ అభిషేకం చేయిస్తే స్వామి వారి కరుణను పొందవచ్చని భక్తులు భావిస్తారు.
5/16
ప్రతి సంవత్సరం 12 శివరాత్రులు వస్తాయి.
6/16
అందులో ఏడాదిలో వచ్చే మహా శివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమైనది.
7/16
ప్రతి ఏడాది మాఘ మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథిలో మహా శివరాత్రి వస్తుంది.
8/16
పురాణాల ప్రకారం ఈ శివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగిందని ప్రతీతి.
9/16
శివరాత్రి వేడుకల్లో భాగంగా అభిషేకాలు, హోమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
10/16
శివుడికి అభిషేకాలు, హోమాలు, విశేష పూజలు జరుగనున్నాయి.
11/16
ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు.
12/16
వేడుకలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నా రు.
13/16
శివరాత్రి రోజున అభిషేక పూజలు, శివపార్వతుల కల్యా ణోత్సవ వేడుకల కోసం ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.
14/16
ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాశివున్ని స్మరిస్తూ భక్తులు ఉపావాసం చేస్తారు.
15/16
సాయంత్రం పలు రకాల పండ్లు సేవించి ఉపావాసాన్ని విడవనున్నారు. ఇందుకోసం మార్కెట్లకు ప్రజలు భారీగా తరలి వచ్చి పండ్లను తీసుకెళ్తున్నారు.
16/16
శివరాత్రి సందర్భంగా పండ్ల కోసం ప్రజలు మార్కెట్లకు తరలి రావడంతో కలకల లాడుతున్నాయి.
Updated at - Feb 25 , 2025 | 09:44 PM