Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు

ABN, Publish Date - Mar 11 , 2025 | 07:35 PM

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ఎల్‌వీసీ సొరంగంలో 18వ రోజు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీం పనులను కలెక్టర్ పరిశీలించారు. రోబో మిషిన్లతో పాటూ కేరళ డాగ్స్‌తో సొరంగం మార్గంతో సిబ్బంది పరిశీలించారు.

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు 1/10

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ఎల్‌వీసీ సొరంగంలో రెస్క్యూ బృందాల పనులు 18వ రోజు కొనసాగుతున్నాయి.

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు 2/10

సొరంగంలో రెస్క్యూ టీం పనులను కలెక్టర్ బాదవత్ సంతోష్ పరిశీలించారు.

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు 3/10

టన్నెల్‌లో రోబోతో చేపడుతున్న పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు 4/10

ఏఐ బేస్ట్ కెమెరా సదుపాయం గల రోబోలను మంగళవారం సొరంగంలోకి పంపించారు.

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు 5/10

సహాయక చర్యల్లో ఎలాంటి ప్రమాదమూ జరగకుండా రోబోలను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు 6/10

రోబోలను ఉపయోగించాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబోటిక్స్ ప్రతినిధులు AI- ఆధారిత రోబోటిక్ కెమెరా వ్యవస్థను వినియోగించారు.

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు 7/10

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కార్యాలయంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై విపత్తు, నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్ బాదవత్ సంతోష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు 8/10

విరామ సమయంలో టన్నెల్ వద్ద భోజనాలు చేస్తున్న సిబ్బంది.

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు 9/10

మొత్తం 110 మంది రెస్క్యూ సిబ్బంది కూడా సొరంగంలోకి వెళ్లారు. సొరంగం లోపల నీరు, బురద కారణంగా లోపల చిక్కుకున్నవారి ఆచూకీ, మృతదేహాల వెలికితీత సవాలుగా మారింది.

Nagarkurnool Tunnel: సొరంగంలో 18వ రోజు.. రెస్క్యూ టీం పనులు 10/10

కాలువలో 13 కిలోమీటర్ల వరకు తవ్వకాలు పూర్తి కాగా.. లోపల నుంచి నీళ్లు ఊట ఊరడంతో బురద పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. కెడావర్ డాగ్స్, రోబోల ద్వారా డెత్ స్పాట్స్ గుర్తిస్తే అక్కడ జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టి, మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated at - Mar 11 , 2025 | 07:36 PM