Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే: మంత్రి నారా లోకేష్

ABN, Publish Date - Aug 31 , 2025 | 09:33 AM

నందమూరి బాలకృష్ణ.. భారతీయ చిత్రసీమలో 50 ఏళ్లుగా హీరోగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు దక్కించుకున్నారు. దీంతో నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్‌లో సన్మాన కార్యక్రమాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈవో సంతోష్ శుక్లా.. మెడల్‌, ప్రత్యేక జ్ఞాపికతోపాటు సర్టిఫికెట్‌ను అందజేశారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 1/12

చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా హీరో నందమూరి బాలకృష్ణ వల్లనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌లో స్థానం సంపాదించిన బాలకృష్ణను హైదరాబాద్‌లోని హోటల్‌లో ఘనంగా సత్కరించారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 2/12

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 50 ఇయర్స్ ఇండస్ట్రీ, సినిమా, సేవా కార్యక్రమాలు, టెలివిజన్ షోలు, పాలిటిక్స్ ఇలా ఎందులోనైనా బాలయ్య నంబర్ వన్ అని అభివర్ణించారు. విశ్వ విఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు తర్వాత రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక్క మాస్ మహారాజ్ బాలయ్య అని పేర్కొన్నారు. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ మాస్ మహారాజ్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారని చెప్పారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 3/12

1974లో తాతమ్మ కలతో మొదలైన ఆయన సినీ ప్రయాణం అఖండ 2 వరకూ వచ్చిందన్నారు. అందరికీ ఏజ్ పెరుగుతుంది కానీ బాలయ్యకు మాత్రం క్రేజ్ పెరుగుతుందని చమత్కరించారు. ఇప్పటికి 109 సినిమాల్లో ఆయన హీరోగా నటించారని గుర్తు చేశారు. ఆ నటించిన చిత్రాల్లో 100 రోజులు కాదు.. 1000 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయని వివరించారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 4/12

ఎవరైనా ఒక జానర్‌లో సక్సెస్ అవుతారని.. కానీ అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి ముద్ర వేసిన కథానాయకుడు బాలయ్య అని చెప్పారు. పౌరాణికం, జానపదం, చారిత్రకం, ఆధ్యాత్మికం, సోషియో ఫాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్.. ఇలా పాత్ర ఏదైనా బాలయ్యకే సాధ్యమన్నారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 5/12

గౌతమీ పుత్ర శాతకర్ణి అంటూ మీసం మెలేసినా ....అఖండ అని గర్జించినా బాలయ్యకే చెల్లిందన్నారు. రాముడు, కృష్ణుడులో మనకు తెలిసిన రూపం నందమూరి తారక రామారావు గారిది అయితే.. మళ్లీ అంతటి చూడ చక్కని రూపం, నట విశ్వరూపం బాలయ్య బాబుదేనన్నారు. శ్రీరామ రాజ్యం చిత్రంతో మళ్లీ మనందరికీ మరోసారి ఎన్టీఆర్‌ని గుర్తుకు తెచ్చారని చెప్పారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 6/12

బాలయ్య నిర్మాతల హీరో, దర్శకుల హీరో, అభిమానుల హీరో అని తెలిపారు. తన సినిమానే కాదు...సినిమా పరిశ్రమ కూడా బాగుండాలని భావించే నిజమైన హీరో ఆయన చెప్పారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 7/12

ఇప్పుడు ఓటీటీ వంతు వచ్చిందని.. బాలయ్య అక్కడా కూడా దుమ్ము రేపుతున్నారన్నారు. బాలయ్య షో చేస్తే రేటింగ్స్ రాకెట్లా దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 8/12

ప్రేక్షకులకు అద్వితీయ వినోదాన్ని అందించారని తెలిపారు. బాలయ్య అడుగు పెడితే ఎక్కడైనా అన్‌స్టాపబుల్ అని ఆయన చేసిన రియాలిటీ షోనే అందుకు నిదర్శనమని చెప్పారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 9/12

అన్ స్టాపబుల్‌తో బాలయ్య ఓటీటీలో సైతం సత్తా చాటారన్నారు. మూడు నంది అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు కూడా వచ్చాయని పేర్కొన్నారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 10/12

బాలయ్య అంటే భోలా శంకరుడు అని.. స్వచ్చమైన మనసు ఆయనదన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారని చెప్పారు. దాపరికం లేదు.. ముందొక మాట.. వెనుక ఒక మాట ఉండదన్నారు. అదీ బాలయ్య స్టైల్. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు సాయంలో ముందుంటారని వివరించారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 11/12

2009 కృష్ణా వరదల్లో ముందుకు వచ్చి సాయం చేశారని.. అలాగే కరోనా సమయంలో ధైర్యంగా అఖండ సినిమా పూర్తి చేసి ఇండస్ట్రీలో ధైర్యాన్ని నింపారన్నారు. ఆ సమయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున సాయం చేశారని వివరించారు. మరో రూ.25 లక్షలు కరోనా విపత్తు సహాయం కోసం ఇచ్చారన్నారు.

Nandamuri Balakrishna: ఏ రంగంలోనైనా నెంబర్ వన్ బాలయ్యే:  మంత్రి నారా లోకేష్ 12/12

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, సినీనటి జయసుధతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated at - Sep 01 , 2025 | 09:22 AM