మురిసిన ముగ్గులు..
ABN, Publish Date - Jan 05 , 2025 | 10:45 AM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు

ముత్యాల ముగ్గులు మెరిసి.. మురిపించి... మైమరిపించాయి. ఇలపై ముద్దాడాయి.

నాగర్ కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో శనివారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్, సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్వేరి పెర్ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్వేర్ ) ఆధ్వర్యంలో నిర్వహించింది.

ఈ పోటీల్లో వనితలు రంగుల హరివిల్లును ఇలపై పరిచారు.

గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా ఆరు వేలు, రెండో బహుమతిగా నాలుగు వేలు, మూడో బహుమతిగా మూడు వేల నగదును అందజేశారు.

ముగ్గుల ఎంపికలో న్యాయనిర్ణేతలు చాకచక్యంగా వ్యవహరించారు.

నాగర్ కర్నూల్లో ముగ్గులను పరిశీలిస్తున్న న్యాయనిర్ణేతలు

వనపర్తిలో ముత్యాల ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన ముగ్గు. (ఇన్పెట్లో) విజేత కవిత
Updated at - Jan 05 , 2025 | 10:49 AM