Miss World 2025: గచ్చిబౌలిలో అందాల భామల ఆటలు..

ABN, Publish Date - May 17 , 2025 | 08:41 PM

Miss World 2025 Hyderabad : 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వేడుకగా సాగుతున్నాయి. ఇవాళ టోర్నీలో భాగంగా అందాల భామలంతా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఆటల పోటీల్లో సందడి చేశారు.

Miss World 2025: గచ్చిబౌలిలో అందాల భామల ఆటలు.. 1/7

హైదరాబాద్ నగర ఖ్యాతి గ్లోబల్ స్థాయిలో మార్మోగేలా 72వ మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

Miss World 2025: గచ్చిబౌలిలో అందాల భామల ఆటలు.. 2/7

మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రోజుకో ప్రసిద్ధ ప్రాంతాన్ని సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇవాళ పోటీల్లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో అందాల పోటీలలో పాల్గొన్నారు.

Miss World 2025: గచ్చిబౌలిలో అందాల భామల ఆటలు.. 3/7

మొత్తం 10 ఈవెంట్ ల‌లో పోటీలు నిర్వహించారు. 109 దేశాల‌కు చెందిన సుంద‌రీమ‌ణులు ఈ ఆటల పోటీల్లో పాల్గొన్నారు.

Miss World 2025: గచ్చిబౌలిలో అందాల భామల ఆటలు.. 4/7

రోలర్ స్కేటింగ్, యోగ నమస్కారం, బాడ్మింటన్, షాట్ పుట్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, షటిల్, ఫిట్ నెస్ రన్ పోటీల‌లో పాల్గొన్నారు. ప్రత్యేకించి జుంబా డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Miss World 2025: గచ్చిబౌలిలో అందాల భామల ఆటలు.. 5/7

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో అమెరికన్, కరీబియన్ ,ఆఫ్రికా, యూరప్,ఆసియా, ఓషియానియా టీంలుగా విడిపోయి పార్టిసిపేట్ చేశారు.

Miss World 2025: గచ్చిబౌలిలో అందాల భామల ఆటలు.. 6/7

మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా పోటీల్లో స్వర్ణం గెల్చుకుని చరిత్ర సృష్టించారు. 1999 తర్వాత ఆమె దేశం తర్వాతి రౌండ్ కు చేరుకోవడం ఇదే తొలిసారి. మిస్ వరల్డ్ మార్టినిక్ ఆరేలీ జోచిమ్ కు రజతం, మిస్ వరల్డ్ కెనడా ఎమ్మా మోరిసన్ కాంస్యం దక్కించుకున్నారు.

Miss World 2025: గచ్చిబౌలిలో అందాల భామల ఆటలు.. 7/7

మే 10న ప్రారంభమైన మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 31 న ముగియనున్నాయి.

Updated at - May 17 , 2025 | 09:05 PM