Ujjaini Mahakali Temple In Secundrabad: తొలి ఏకాదశి.. ఉజ్జయిని మహాకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Jul 06 , 2025 | 03:32 PM

ఆషాఢ మాసం ప్రారంభమైందంటేనే.. తెలంగాణలో బోనాలు పండగ వచ్చినట్లు. ఈ పండగ సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మ వారికి బోనం సమర్పించేందుకు ఈ దేవాలయానికి మహిళలు భారీగా తరలి వచ్చారు. ఆ క్రమంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అదీకాక ఆదివారం అంటే.. జులై 06 తొలి ఏకాదశి. ఈ రోజు అత్యంత పర్వదినం. ఈ సందర్భంగా మహాకాళి ఆలయంతోపాటు సికింద్రాబాద్‌లోని విఠలేశ్వర దేవాలయానికి సైతం భక్తులు పోటెత్తారు. అమ్మ, అయ్యవారుల దర్శనం కోసం భక్తుల.. రహదారులపై బారులు తీరారు.

Updated at - Jul 06 , 2025 | 03:34 PM