CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ భేటీ
ABN, Publish Date - Sep 20 , 2025 | 03:51 PM
ఎంసీహెచ్‌ఆర్డీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(శనివారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
1/6
ఎంసీహెచ్‌ఆర్డీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(శనివారం) సమావేశం అయ్యారు.
2/6
ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
3/6
ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చించారు.
4/6
కొత్త జిల్లాల్లో అవసరమైన ప్రాంతాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని వారు కోరారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
5/6
ప్రాధాన్యత వారీగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లోని కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారికి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
6/6
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, లా సెక్రటరీ పాపిరెడ్డి, జస్టిస్ పి. సామ్ కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated at - Sep 20 , 2025 | 03:51 PM