Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో నారెడ్కో సమావేశం.. పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ABN, Publish Date - Oct 11 , 2025 | 07:15 AM
హైదరాబాద్‌లో నారెడ్కో 15వ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు.
1/9
హైదరాబాద్‌లో నారెడ్కో 15వ సమావేశం శుక్రవారం జరిగింది.
2/9
ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు.
3/9
హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
4/9
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వేగంగా దూసుకెళ్తుందని ఉద్ఘాటించారు మల్లు భట్టి విక్రమార్క.
5/9
బిల్డర్లు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు మల్లు భట్టి విక్రమార్క.
6/9
భవిష్యత్తులో హైదరాబాదులో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే రానున్నాయని పేర్కొన్నారు.
7/9
ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధికి ప్రణాళిక వ్యయంలో భాగంగా బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నామని గుర్తుచేశారు మల్లు భట్టి విక్రమార్క.
8/9
రెండు సంవత్సరాల్లో రూ.20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని వివరించారు.
9/9
ఈ పనులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Updated at - Oct 11 , 2025 | 07:16 AM