ఎస్సీ బాలుర హాస్టల్లో రాత్రి జిల్లా కలెక్టర్ బస
ABN, Publish Date - Feb 06 , 2025 | 09:00 AM
యాదాద్రి భువనగిరి జిల్లా : నారాయణపూర్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు రాత్రి బస చేశారు. వచ్చి రాగానే పిల్లలు ఎలా ఉన్నారు, ఏలా చదువుతున్నారు అని పిల్లతో ముచ్చటించారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్‌లు అందజేశారు. అలాగే విద్యార్థుల వసతులను కూడా పరిశీలించారు. 10 వ తరగతి విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని సూచించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపూర్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్ హనుమంతరావు

విద్యార్థుల స్టడీని పరిశీలిస్తున్న కలెక్టర్.. వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న హనుమంతరావు..

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్‌లు అందజేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు..

విద్యార్థులతో ముచ్చటిస్తూ.. సరదగా గడిపిన కలెక్టర్..

జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థుల వసతులను పరిశీలించి.. రాత్రి విద్యార్థులతోనే కలిసి నిద్ర చేశారు.
Updated at - Feb 06 , 2025 | 09:00 AM