CM Revanth Reddy: సింగపూర్‌లో బిజీబిజీగా సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధానంగా వీటిపైనే దృష్టి
ABN, Publish Date - Jan 17 , 2025 | 12:10 PM
సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభమైంది. సింగపూర్ విదేశాంగ మంత్రి వీవీయన్ బాలతో చర్చలతో టూర్‌ను రేవంత్ ప్రారంభించారు. తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్‌లో పర్యటిస్తున్నారు.

సింగపూర్‌లో రేవంత్ పర్యటన బిజీ బిజీగా ఉండనుంది.

సింగపూర్ విదేశాంగ మంత్రి వీవీయన్ బాలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

వీరిద్దరి భేటీలో తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కులకు దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఆహ్వానించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిసారించారు.
Updated at - Jan 17 , 2025 | 12:31 PM