CM Revanth Reddy: హైదరాబాద్‌లో టూరిజం కాన్క్లేవ్లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Sep 28 , 2025 | 07:46 AM
టూరిజం కాన్క్లేవ్లో-2025 కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పారామంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కాన్క్లేవ్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
1/15
టూరిజం కాన్క్లేవ్లో-2025 కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పారామంలో శనివారం జరిగింది.
2/15
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
3/15
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
4/15
ప్రజా ప్రభుత్వం ఏర్పడే వరకు తెలంగాణకు పర్యాటక పాలసీ లేదని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
5/15
పాలసీ తెచ్చి, ఈ రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తాము తీసుకొచ్చామని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావుకు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.
6/15
ఈ క్రమంలో పెట్టుబడిదారులకు హామీ ఇస్తున్నామని తెలిపారు.
7/15
పెట్టుబడిదారులు పెట్టే ప్రతి రూపాయికి ఇక్కడ భద్రత ఉంటుందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
8/15
భారత్, పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్‌లో ప్రపంచ సుందరీమణుల పోటీలను ప్రశాంతంగా నిర్వహించామని గుర్తుచేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
9/15
శాంతిభద్రతల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ అని ఉద్ఘాటించారు.
10/15
ఈ కాన్ క్లేవ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు పలు సంస్థలు ఎంవోయూ కుదుర్చుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
11/15
తద్వారా 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
12/15
తెలంగాణ రాష్ట్రం పర్యాటకానికి గమ్యస్థానంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
13/15
రాష్ట్రంలో, హైదరాబాద్‌లో అనేక పర్యాటక కేంద్రాలు, పురాతన, వారసత్వ కట్టడాలు, ఆలయాలు ఉన్నాయని వివరించారు.
14/15
పర్యాటకరంగ పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
15/15
హైదరాబాద్‌లో చార్మినార్, గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వీటితోపాటు అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, వేయి స్థంభాల గుడి, అలంపూర్ శక్తిపీఠం ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated at - Sep 28 , 2025 | 07:46 AM