CM Revanth Reddy: గ్రూప్-1 నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Sep 28 , 2025 | 07:12 AM
ఇటీవల గ్రూప్-1 అధికారులుగా ఎంపికైన 562 మందికి నియామక పత్రాలు అందజేశారు. శనివారం శిల్పారామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
1/10
ఇటీవల గ్రూప్-1 అధికారులుగా ఎంపికైన 562 మందికి నియామక పత్రాలు అందజేశారు.
2/10
శనివారం శిల్పారామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
3/10
ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, తదితరులు హాజరయ్యారు.
4/10
ఈ సందర్భంగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
5/10
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అత్యంత పారదర్శకంగా, నిబద్ధతతో గ్రూప్ - 1 పరీక్షలు నిర్వహించామని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
6/10
కేవలం 19 నెలల వ్యవధిలో గ్రూప్-1 ప్రక్రియ పూర్తి చేసి, న్యాయపరమైన చిక్కుముళ్లను అధిగమించామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
7/10
గ్రూప్-1లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడం తన జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టమని నొక్కిచెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి.
8/10
నియామక పత్రాలు అందుకున్న వీళ్లే రేపటి తెలంగాణ పునర్ నిర్మాణ సైనికులని తెలిపారు.
9/10
గ్రూప్-1లో ఎంపికైన అభ్యర్థులు మూడు దశాబ్ధాల పాటు పేదలకు, ప్రజలకు నిజాయితీగా సేవలు అందించి పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటారని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
10/10
ఇక నుంచి తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే బాధ్యత మీపై ఉందని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.
Updated at - Sep 28 , 2025 | 07:46 AM