CM Revanth Reddy: మల్లేపల్లిలో ఏటీసీలను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Sep 28 , 2025 | 08:12 AM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఐటీఐలతోపాటు హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ఐటీఐలో శనివారం అధునాతన సాంకేతిక కేంద్రాలు (ఏటీసీలు) ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మల్లేపల్లిలోని ఐటీఐ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా వీటిని ప్రారంభించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో, అమ్రాబాద్ మండలం మన్ననూరులో, వనపర్తిలోని నాగవరం శివారులో ఉన్న ఐటీఐలలో ఈ కేంద్రాలను ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. మరోవైపు అల్వాల్ ఐటీఐ ప్రాంగణంలో టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.6.76 కోట్లతో నిర్మించిన ఏటీసీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
1/15
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఐటీఐలతోపాటు హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ఐటీఐలో శనివారం అధునాతన సాంకేతిక కేంద్రాలు (ఏటీసీలు) ప్రారంభమయ్యాయి.
2/15
మల్లేపల్లిలోని ఐటీఐ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా వీటిని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
3/15
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో, అమ్రాబాద్ మండలం మన్ననూరులో, వనపర్తిలోని నాగవరం శివారులో ఉన్న ఐటీఐలలో ఈ కేంద్రాలను ప్రారంభించారు.
4/15
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
5/15
చరిత్ర పుటల్లో కలిసిపోతున్న ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
6/15
చరిత్రను తిరగరాసేలా మన యువతకు నైపుణ్యాలను నేర్పించి మార్పు అంటే ఇదీ అని చాటి చెప్పామని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.
7/15
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను ప్రారంభించి మన యువతకు జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోగల నిపుణులుగా తయారు చేస్తున్నామని వెల్లడించారు సీఎం రేవంత్‌రెడ్డి.
8/15
65 ఏటీసీలకు ఇదే మల్లేపల్లిలో తన చేతుల మీదుగా గతంలో శంకుస్థాపన చేసి, ఈ రోజు తానే ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు సీఎం రేవంత్‌రెడ్డి.
9/15
ఈ సందర్భంలో మరో 51 ఏటీసీలను మంజూరు చేశామని ప్రకటించారు.
10/15
ఈ ఏడాదిలో వాటి నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
11/15
యువత చెడు అలవాట్లకు బానిస కావద్దని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
12/15
తల్లిదండ్రులకు శోకాన్ని తెచ్చిపెట్ట వద్దని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
13/15
జీవితంలో ఎదగడానికి అన్నీ అవకాశాలను ప్రజా ప్రభుత్వం కల్పిస్తోందని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి.
14/15
ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అని తెలిపారు.
15/15
వచ్చే ఏడాది నుంచి ఏటీసీలో చదివే విద్యార్థులకు నెలకు రూ.2000 స్టైఫండ్ ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన టాటా సంస్థకు అభినందనలు తెలిపారు.
Updated at - Sep 28 , 2025 | 08:21 AM