భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు

ABN, Publish Date - Jul 20 , 2025 | 10:56 AM

అల్పపీడన ప్రభావంతో భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వానలతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. జిల్లాలోని వేషాలపల్లి గ్రామంలో వరినాట్లు జోరందుకున్నాయి. మహిళా రైతులు నాట్లు వేయడానికి సిద్ధమయ్యారు. నాట్ల సందర్భంగా దేవుడికి మొక్కుకుని ఈ ఏడాది అధిక దిగుబడి రావాలని రైతులు కోరుకున్నారు. పలు గ్రామాల్లో ముందస్తుగానే వరి నాట్లు సాగు చేస్తున్నారు. వరి నాట్లు వేస్తుండటంతో ట్రాక్టర్లకు, కూలీలకు డిమాండ్‌ బాగా పెరిగింది.

భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 1/10

 అల్పపీడన ప్రభావంతో భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వానలతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. జిల్లాలోని వేషాలపల్లి గ్రామంలో వరినాట్లు జోరందుకున్నాయి. మహిళా రైతులు నాట్లు వేయడానికి సిద్ధమయ్యారు.

భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 2/10

నాట్ల సందర్భంగా దేవుడికి మొక్కుకుని ఈ ఏడాది అధిక దిగుబడి రావాలని రైతులు కోరుకున్నారు. పలు గ్రామాల్లో ముందస్తుగానే వరి నాట్లు సాగు చేస్తున్నారు. వరి నాట్లు వేస్తుండటంతో ట్రాక్టర్లకు, కూలీలకు డిమాండ్‌ బాగా పెరిగింది.

భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 3/10

ప్రధానంగా దుక్కులు దున్నడం మొదలు గొర్రు కొట్టడం వరకు రైతులు పూర్తిగా ట్రాక్టర్లనే వినియోగిస్తున్నారు. దీంతో ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరిగింది. బురద పనికి ట్రాక్టర్‌ గంటకు రూ.1,300 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే వరినాట్ల కోసం మహిళలకు ఎకరం నాటుకు రూ.5,500 వసూలు చేస్తున్నారు.

భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 4/10

వ్యవసాయ పనులకు వచ్చే మగవారికి రూ.వెయ్యి ఇస్తున్నారు. అయినప్పటికీ కూలీలు దొరక్క పనులు అలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 5/10

రైతులు ఈ ఏడాది సన్నాల సాగుపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ప్రకటించడంతోనూ సన్న రకం సాగు పెరిగేందుకు కారణమని వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు.

భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 6/10

అలాగే బియ్యం ధరలు బాగా పెరడంతో కొంతమంది రైతులు బియ్యం పట్టించి విక్రయించే అన్నదాతలు సైతం సన్నరకాల సాగుపై దృష్టి సారిస్తున్నారు.

భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 7/10

అందరూ రైతులు ఒకేసారి వరినాటు పనులు ప్రారంభించడంతో ఈ సమస్య తలెత్తుతోందని అంటున్నారు.

భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 8/10

దీంతో కూలీలు చెప్పిన రోజునే నాటుకోసం ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది. నాట్లకోసం అవసరమైన ఎరువులు సిద్ధంగా ఉంచాలని రైతులు కోరుతున్నారు.

భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 9/10

ప్రధానంగా డీఏపీ, యూరియా, జింక్‌ సల్ఫేట్‌ వంటి ఎరువులను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.

భూపాలపల్లి జిల్లాలో జోరందుకున్న వరినాట్లు 10/10

అయితే రైతులకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా రైతు వేదికల్లో సమాచారం అందిస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

Updated at - Jul 20 , 2025 | 11:02 AM