ABN Andhra Jyothy: రంగవల్లులతో సంక్రాంతి శోభ.. ABN ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలకు వేళాయె
ABN, Publish Date - Jan 04 , 2025 | 05:00 PM
సంక్రాంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది మాదిరిగానే ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్’ యాజమాన్యం ఈ ఏడాది కూడా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించింది. ‘ఆంధ్రజ్యోతి’, ఏబీఎన్’ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు...గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్ వారి పర్‌ఫెక్ట్...ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) సహకారం అందించనున్నాయి.

ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందించనున్నారు. ముగ్గు, రంగులు వగైరా సామగ్రి పోటీదారులే తెచ్చుకోవాలి.

ముగ్గు వేయడానికి గరిష్ఠ సమయం రెండు గంటలు. పోటీల్లో పాల్గొనాలనుకునేవారు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

పేర్లు రిజిస్ర్టేషన్ చేయించుకున్న వారిలో ముందుగా వచ్చిన వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశం లభించనుంది.

గద్వాల జిల్లా శాంతినగర్లో ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

ముగ్గుల పోటీల్లో మహిళలు భారీగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్ పర్సన్, దాతలు, జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

అలాగే వరంగల్ జిల్లాలో నర్సంపేట పట్టణంలో ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలో పాల్గొన్న వారికి కన్సోలేషన్ బహుమతులు ఇస్తారు.
Updated at - Jan 04 , 2025 | 05:00 PM