యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవలో పీవీ సింధు దంపతులు
ABN, Publish Date - Oct 18 , 2025 | 09:32 PM
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు దంపతులు దర్శించుకున్నారు. భర్త వెంకట దత్తసాయితో కలిసి సింధు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
1/5
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు దంపతులు దర్శించుకున్నారు.
2/5
భర్త వెంకట దత్తసాయితో కలిసి సింధు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.
3/5
సింధు దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి నిత్యకల్యాణ మహోత్సవంలో పీవీ సింధు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
4/5
ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన పూజల్లో పీవీ సింధు, సాయి జంట పాల్గొన్నారు.
5/5
అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి సింధు దంపతులుతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Updated at - Oct 18 , 2025 | 09:32 PM