Yeti panduga: నెల్లూరు జిల్లాలో ఘనంగా ఏటి పండుగ

ABN, Publish Date - Jan 17 , 2025 | 08:12 AM

ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఏటిపండుగ ఈ ఏడాది నిరాడంబరంగా జరిగింది. ఏటిపండగలో భాగంగా పెన్నానదికి చేరుకున్న చిన్నారులు, పెద్దలు పలు రకాల తినుబండారాలను ఆనందంగా భుజించారు. పండగ నెల మొదలైన రోజు నుంచి గొబ్బెమ్మలను పూజలు చేసి నిమజ్జనం చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Yeti panduga: నెల్లూరు జిల్లాలో ఘనంగా ఏటి పండుగ 1/7

నెల్లూరు జిల్లాలో ఏటి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.

Yeti panduga: నెల్లూరు జిల్లాలో ఘనంగా ఏటి పండుగ 2/7

సంక్రాంతి సంబరాల్లో చివరి రోజు ముక్కనుమ నాడు ఏటి పండుగను చేసుకుంటారు.

Yeti panduga: నెల్లూరు జిల్లాలో ఘనంగా ఏటి పండుగ 3/7

నెల్లూరు జిల్లాలోని పెన్నానది తీరంలో వైభవంగా జరిగింది.

Yeti panduga: నెల్లూరు జిల్లాలో ఘనంగా ఏటి పండుగ 4/7

కులమతాలకు అతీతంగా కుటుంబాలతో కలిసి వచ్చి పాల్గొనడంతో పెన్నాతీరం కిటకిట లాడింది.

Yeti panduga: నెల్లూరు జిల్లాలో ఘనంగా ఏటి పండుగ 5/7

భక్తులను ఆశీర్వదించేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి దేవతా మూర్తులు సర్వాభరణాలు, విశేష అలం కారాలతో తరలి వచ్చి కొలువుదీరారు.

Yeti panduga: నెల్లూరు జిల్లాలో ఘనంగా ఏటి పండుగ 6/7

దేవతామూర్తులు ప్రత్యేక సెట్టింగుల్లో కొలువుదీరారు. గణపతి, రాజరాజేశ్వరి అమ్మవారు, మూలస్ధానేశ్వర స్వామి, తల్పగిరి రంగనాథస్వామి, జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారు, నర్రవాడ వెంగమాంబ అమ్మవార్లు విశేష అలంకారంతో కొలువుదీరి భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసాదం వితరణ జరిగింది.

Yeti panduga: నెల్లూరు జిల్లాలో ఘనంగా ఏటి పండుగ 7/7

మహిళలు గొబ్బెమ్మలకు పూజలు చేసి, పాటలు పాడుతూ పెన్నలో నిమజ్జనం చేశారు.

Updated at - Jan 17 , 2025 | 08:45 AM