Edupayala Jatara: వరాల తల్లి.. ఏడుపాయల దుర్గమ్మ జాతరకు వేళాయే
ABN, Publish Date - Feb 27 , 2025 | 08:26 PM
తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన వందేళ్ల చరిత్ర గల ఏడుపాయల వనదుర్గామాత దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాపన్నపేట మండలం నాగ్సన్ పల్లిలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతర ప్రసిద్ధి చెందింది.

తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన వందేళ్ల చరిత్ర గల ఏడుపాయల వనదుర్గామాత దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి గ్రామ శివారులో వెలసిన ఏడుపాయల దుర్గాభవానిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు.

. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాపన్నపేట మండలం నాగ్సన్ పల్లిలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది.

మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతర ప్రసిద్ధి చెందింది.

ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అక్కడి మంజీరా నదిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.

మహాశివరాత్రి నుంచి మూడు రోజుల పాటు వనదుర్గా భవాని జాతర కొనసాగుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దుర్గామాత సన్నిధిలో వారం రోజుల పాటు జాతర జరగడం ఇక్కడ ఆనవాయితీ. ఉపవాస దీక్షలతో ప్రారంభమయ్యే ఉత్సవాలు వారం రోజుల పాటు కొనసాగుతాయి.

మరుసటిరోజు ఘనంగా జరిగే బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఆమరుసటి రోజు రథోత్సవం, మొక్కుబడులు చెల్లించకోవడం, మేకపోతులను బలివ్వడం, బోనాల ఊరేగింపులు చేపట్టడం, వింధు వినోదాలతో సంబరాలు జరుపుకోవడం వంటి కార్యక్రమాలను భక్తులు జరుపుకుంటారు.

17వ శతాబ్దానికి పూర్వం ఏడుపాయల్లో వనదుర్గామాత వెలసినట్లు చారిత్రక ఆధారాలు, జానపదుల గాథలు తెలిజేస్తున్నాయి. మాఘమ అమావాస్య పర్వదినం సందర్భంగా దుర్గామాత సన్నిధిలో జరిగే ఉత్సవం అనంతరం సరిగ్గా నెలరోజులకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దుర్గామాత సన్నిధిలో వారం రోజుల పాటు జాతర జరగడం ఇక్కడ ఆనవాయితీ.

దట్టమైన ఆరణ్యంలో ఓ కొండ గుహలో అమ్మవారు వెలిసి నేటికీ భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తోంది. అమ్మవారు వెలసిన ప్రదేశం ముందు, వెనక భాగాల నుంచి ఏడుపాయలుగా విడిపోయి మంజీర నది ప్రవహిస్తూ ఉంటుంది.

ఏఢు ఉప నదులు కలిసి గోదావరి నదికి ఉపనది అయినా మంజీరా నదిలో కలుస్తుండటంతో దీనికి ఏడుపాయల అనే పేరు వచ్చింది.

నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడం ఇప్పటికీ ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
Updated at - Feb 27 , 2025 | 08:26 PM