భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా గజారోహణం
ABN, Publish Date - Dec 15 , 2025 | 12:36 PM
శ్రీనగర్ కాలనీ అయ్యప్ప ఆలయ గజారోహణ కార్యక్రమం ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆధ్యాత్మిక నినాదాలు మిన్నంటాయి. అయ్యప్ప భక్తుల కోలాటాలతో దారులన్నీ భక్తిసంద్రంగా మారాయి.
1/10
శ్రీనగర్ కాలనీ అయ్యప్ప ఆలయ గజారోహణ కార్యక్రమం ఆదివారం నాడు కనుల పండువగా జరిగింది.
2/10
స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆధ్యాత్మిక నినాదాలు మిన్నంటాయి.
3/10
శబరిమల మాజీ మేల్ శాంతి మనోజ్ నంబూద్రి ఆధ్వర్యంలో పడిపూజ, భగవతి సేవ వైభవంగా జరిగింది.
4/10
అయ్యప్ప భక్తుల కోలాటాలు ప్రదర్శించగా.. దారులన్ని అయ్యప్ప నామస్మరణతో భక్తిసంద్రంగా మార్మోగాయి.
5/10
ఆలయ ఈఓ శ్రీనివాస శర్మ, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అర్జున్ యాదవ్ ఊరేగింపును ప్రారంభించారు.
6/10
అయ్యప్ప మండల పూజల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, గణపతి హోమం నిర్వహించారు.
7/10
అనంతరం శబరిమల తరహాలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 5నుంచి అయ్యప్ప స్వామికి ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు.
8/10
ఏనుగు అంబారీపై అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. దేవతా మూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
9/10
శ్రీనగర్ కాలనీ, ఇందిరానగర్, కృష్ణానగర్, యూసఫ్‌గూడ, శాలివాహననగర్, ఆర్బీఐ క్వార్టర్స్, ఎల్లారెడ్డిగూడ మీదుగా ఊరేగింపు అయ్యప్ప ఆలయానికి చేరుకుంది.
10/10
కేరళా తరహా మేళతాళాలు, దేవతామూర్తుల వేషాధారణలు ఆకట్టుకున్నాయి. ఆలయ అర్చకులు శ్రీనివాస. శర్మ, రామకృష్ణశర్మలు పూజాధికాలను దగ్గరుండి పర్యవేక్షించారు.
Updated at - Dec 15 , 2025 | 12:49 PM