Puttaparthi Sathya Sai Baba: అంగరంగ వైభవంగా సత్య సాయి బాబా రథోత్సవం
ABN, Publish Date - Nov 19 , 2025 | 07:50 AM
సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పుట్టపర్తిలో మంగళవారం అశేష భక్తుల నడుమ సత్యసాయి నారాయణ రథోత్సవం వైభవంగా జరిగింది.
1/12
సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి.
2/12
సాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
3/12
పుట్టపర్తిలో మంగళవారం అశేష భక్తుల నడుమ సత్యసాయి నారాయణ రథోత్సవం ఘనంగా జరిగింది.
4/12
సాయికుల్వంతు మందిరంలో సత్యసాయి స్వర్ణ విగ్రహానికి బ్రాహ్మణులు పూజలు నిర్వహించారు.
5/12
అనంతరం స్వర్ణ విగ్రహాన్ని, వేణుగోపాలస్వామి, సీతారాముల ఉత్సవ మూర్తులను గోపురం వద్దకు తోడ్కొని వచ్చి వెండి రథంపై కొలువుదీర్చారు. సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు.
6/12
ప్రత్యేకంగా పుట్టపర్తి సాయి బాబా లేజర్ షో నిర్వహించారు.
7/12
సాయిబాబా ఫొటోతో ప్రత్యేకంగా నిర్వహించిన లేజర్ షో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
8/12
లేజర్ షోను ఫొటోలు తీస్తున్న భక్తులు.
9/12
లేజర్‌ని చూసి భక్తులు మైమరచిపోయారు.
10/12
లేజర్ షో లో విద్యుత్ వెలుగుల మధ్య సత్య సాయిబాబా ఫొటో.
11/12
సాయిబాబాకు బ్రాహ్మణులు ప్రత్యేకంగా పూజలు చేశారు.
12/12
వివిధ రకాల పూలతో అలంకరించిన పుట్టపర్తి సాయిబాబా మహా సమాధి.
Updated at - Nov 19 , 2025 | 07:57 AM