Kedharnath Yatra : తక్కువ ఖర్చుతో కేదార్‌నాథ్ ఎలా వెళ్లాలో తెలుసా..
ABN, Publish Date - Feb 19 , 2025 | 07:17 PM
భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కేదార్‌నాథ్ మందిరంలో ఉందని హిందువుల విశ్వాసం. మందాకినీ నది పక్కన, సముద్ర మట్టానికి 3,583 అడుగులో ఎత్తులో ఉండే ఈ ఆలయం ఏడాదిలో కొన్నాళ్లు మాత్రమే తెరుచుకుంటుంది. జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్ వెళ్లాలని కోరుకుంటారు భక్తులు. మరి, తక్కువ ఖర్చుతోనే ఈ యాత్ర ఎలా చేయాలో మీకు తెలుసా..

మహాశివరాత్రి రోజున ప్రజలు శివుడిని పూజిస్తారు. ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. భారతదేశంలో అనేక ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి.

కేదార్‌నాథ్ ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో ఉంది. భోలానాథ్ దర్శనం కోసం ఏటా ప్రజలు కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు తహతహలాడతారు.

కేదార్‌నాథ్ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది నాలుగు ధామాలు, పంచ కేదార్లలో ఒకటి.

కేదార్‌నాథ్‌కు వెళ్లడానికి మీరు రైలు, బస్సు, విమానం లేదా హెలికాప్టర్‌లో వెళ్ళవచ్చు. ఇక్కడికి వెళ్లాలంటే హరిద్వార్ లేదా డెహ్రాడూన్ మీదుగా వెళ్ళాలి.

కేదార్‌నాథ్‌కు విమానంలో వెళుతుంటే, ఒక వ్యక్తికి విమాన టిక్కెట్ ధర (హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్) రూ.9,500 - రూ. 24,000. మొత్తం కనీస ప్రయాణ బడ్జెట్ రూ.14,050 - రూ. 34,100

రైలులో ప్రయాణిస్తుంటే, ఒక వ్యక్తికి ఛార్జీ (హైదరాబాద్/విశాఖపట్నం నుంచి హరిద్వార్) రూ.1,000 - రూ. 2,500. మొత్తం కనీస ప్రయాణ బడ్జెట్ రూ. 4,350 - రూ. 9,100

కేదార్‌నాథ్‌కు నేరుగా బస్సులో కూడా వెళ్ళవచ్చు. హైదరాబాద్/విశాఖపట్నం నుంచి ఢిల్లీ రూ.1,500 - రూ.3,000. ఢిల్లీ నుండి హరిద్వార్ రూ. 500 - రూ.1,000. మొత్తం కనీస బడ్జెట్ రూ.6,450 - రూ.12,100

కేదార్‌నాథ్‌కు 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఒక్కొక్కరికి దాదాపు రూ.5 నుంచి రూ.10,000 రూపాయలలోపు ఖర్చవుతుంది.

కేదార్‌నాథ్ కాలినడకన వెళ్తే దాదాపు 6 నుండి 8 గంటలు పడుతుంది. ఆ సమయంలో కర్ర, కొన్ని అత్యవసర వస్తువులు తప్పక మీతో తీసుకెళ్లాలి.

మీరు గుర్రాన్ని తీసుకుంటే ఒక్కొక్కరికి రూ. 2300 ఖర్చవుతుంది. పోర్టర్‌ను తీసుకుంటే రూ.5,500 నుంచి రూ.7,000 వరకు ఉంటుంది.
Updated at - Feb 19 , 2025 | 07:23 PM