తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Jun 15 , 2025 | 08:13 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కుటుంబసభ్యులతో కలిసి ఏడుకొండలకు తరలివస్తున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కుటుంబసభ్యులతో కలిసి ఏడుకొండలకు తరలివస్తున్నారు.

విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో క్యూలైన్లు కిక్కిరిపోతున్నాయి. చిన్నాపెద్దా అంతా కలిసి క్యూలైన్లలో నిలబడడంతో ఇబ్బందులు పడుతున్నారు.

తిరుమల కృష్ణతేజ సర్కిల్ నుంచి శిలాతోరణం వరకూ క్యూలైన్లలో భక్తులు పెద్దఎత్తున వేచి ఉన్నారు.

సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు.

భక్తుల కోసం టీటీడీ పూర్తి ఏర్పాట్లు చేసింది. అయితే భక్తుల సంఖ్య రోజువారీ కంటే కాస్త ఎక్కువ కావడంతో చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యాయి.
Updated at - Jun 15 , 2025 | 08:14 PM