YS Jagan: కడపలో వివాహ వేడుకలో మాజీ సీఎం వైఎస్ జగన్ సందడి
ABN, Publish Date - Feb 14 , 2025 | 12:36 PM
కడపలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో పలు కార్యక్రమాల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు.

కడపలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు.

జిల్లాలో పలు కార్యక్రమాల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు.

కడప నగరంలోని మేడా రఘునాధ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైఎస్ జగన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులు లక్ష్మీ మౌనిక, సుధీర్ కుమార్ రెడ్డిలను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

వివాహ వేడుకకు జగన్ రావడంతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. జగన్‌తో ఫొటోలు దిగడానికి అభిమానులు, నేతలు ఉత్సాహం చూపించారు.
Updated at - Feb 14 , 2025 | 12:39 PM