నెల్లూరు జిల్లాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘అక్షరమే అండగా... పరిష్కారమే అజెండాగా’ విజయోత్సవ సభ
ABN, Publish Date - May 21 , 2025 | 05:31 PM
నెల్లూరు జిల్లాలోని సౌత్ మోపూరు గ్రామంలో బుధవారం నాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘అక్షరమే అండగా... పరిష్కారమే అజెండాగా’ విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య, టీడీపీ సీనియర్ నేత గిరిధర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
1/12
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రూపొందించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండగా’ కార్యక్రమం విజయోత్సవ సభను నెల్లూరు జిల్లా సౌత్ మోపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
2/12
ఈ విజయోత్సవ సభలో ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత గిరిధర్ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.
3/12
ఈ సందర్భంగా మాట్లాడిన ఆదిత్య.. ప్రజల సమస్యలు తీర్చడానికే ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండగా’ కార్యక్రమం రూపొందించామని ఉద్ఘాటించారు. ప్రస్తుత కాలంలో పత్రికలు సమస్యలను ప్రచురించడంతోనే సరిపెట్టుకుంటున్నాయని.. పరిష్కారం చూపడం లేదని అన్నారు.
4/12
సౌత్ మోపూర్ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు.
5/12
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. మారుమూల గ్రామమైన మోపూరుకు ఆంధ్రజ్యోతి ఈడీ ఆదిత్య రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
6/12
40 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని చెప్పామని.. చెప్పినట్టుగా రూ.1.22కోట్లతో అభివృద్ది పనులు చేశామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
7/12
ఆదిత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సాక్షిగా మాటిస్తున్నా.. మరో ఏడాదిలో మరో రూ. కోటి నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే వెల్లడించారు.
8/12
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అన్యాయాలు, అకృత్యాలు ఎంతగా సాగాయో చూశామని.. అటువంటి క్లిష్ట సమయంలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కీలక భూమిక పోషించిందని గుర్తుచేశారు.
9/12
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎన్నో కష్టనష్టాలనుకోర్చి ప్రజల కోసం నిల్చుందన్నారు. తాము తప్పు చేసినా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఒప్పుకోదన్న ఎమ్మెల్యే.. ఎవరు తప్పుచేసినా తాటతీయడం వారి నైజం అని పేర్కొన్నారు.
10/12
ఇక సౌత్ మోపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో సమస్యలు తీరాయన్నారు. ఆంధ్రజ్యోతి, ఎమ్మెల్యే కోటంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
11/12
తమ గ్రామంలో మెయిన్ రోడ్డు గుంతల మయమై వర్షపు నీరంతా నిలిచేదని.. దోమల వల్ల విష జ్వరాలు వచ్చి ఐదుగురు మృతి చెందారని గ్రామస్తులు చెప్పారు. ఇప్పుడు రోడ్డు వేసి ఆ సమస్యని తీర్చారని అన్నారు.
12/12
అక్షరమే అండగా... పరిష్కారమే అజెండాగా.. కార్యక్రమానికి తమ గ్రామాన్ని ఎంచుకున్నందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Updated at - May 21 , 2025 | 05:50 PM