Sankranthi 2025: జోరుగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్లు

ABN, Publish Date - Jan 13 , 2025 | 11:21 AM

సంక్రాంతి పండుగ అంటేనే ప్రధానంగా కోడి పందాలు గుర్తుకొస్తాయి. ఈ మూడు రోజులే లక్ష్యంగా కోడి పందాలను నిర్వహించడానికి పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. గోదావరి, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు బరులు సిద్ధమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. ప్రతి ప్రధాన బరికి అనుబంధంగా మరో పది పందాల బరులు చిన్నవిగా ఉండనున్నాయి.

Sankranthi 2025: జోరుగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్లు 1/8

సంక్రాంతి పండుగ అంటేనే ముఖ్యంగా కోడి పందాలు గుర్తుకువస్తాయి. ఈ మూడు రోజులే లక్ష్యంగా కోడి పందాలను నిర్వహించడానికి జూదరులు సిద్ధమవుతున్నారు. మంచిగా బలంగా ఉండే కోడి పుంజులను పందాల కోసం ఎంచుకుంటారు. వీటికి బాదం, పిస్తా, తదితర పౌష్టికాహారం పెట్టి పెంచుతారు.

Sankranthi 2025: జోరుగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్లు 2/8

కోడి పందాలతో పాటు వివిధ రకాల జూద క్రీడలతో ఏపీలో కోట్ల రూపాయలు చేతులుమారనున్నాయి. ఈ పందాలను చూడటానికి హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి వచ్చి వీటిని తిలకిస్తారు. పందెం కాయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.

Sankranthi 2025: జోరుగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్లు 3/8

కోడి పందాల బరులను ఏర్పాటు చేయడానికి ఎన్నో పైసలు ఖర్చు చేస్తారు. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు ఇక్కడ కోడిపందాలతోపాటు పేకాట, గుండాట నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు కోడి పందాలు నిర్వహించే ప్రాంతాల్లో మద్యం విక్రయాలు కూడా జోరుగా సాగుతాయి.

Sankranthi 2025: జోరుగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్లు 4/8

కోడిపందాల కోసం ఇప్పటి వరకు ఉన్న బరులు కాకుండా వేర్వురుగా కొత్త బరులు వెలుస్తున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది పందెం రాయుళ్లదే పైచేయిగా కనిపిస్తోంది. కోడి పందాల ముసుగులో ఆదాయాన్ని ఆర్జించే ‘ఆట’లకు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Sankranthi 2025: జోరుగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్లు 5/8

కోడి పుంజుల కోసం ప్రత్యేకంగా కోడి కత్తులు తయారు చేశారు. వీటిని పుంజుల కాళ్లకు కట్టి బరిలోకి వదులుతారు.

Sankranthi 2025: జోరుగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్లు 6/8

కోడిపందేలకు ఎలాంటి అనుమతులు లేవని, ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు కొద్దిరోజులుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Sankranthi 2025: జోరుగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్లు 7/8

వాటిని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. మామిడి తోటల్లో, ఆట స్థలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, రైతుల పొలాల్లో ఇలా ఎక్కడ చూసినా కోడిపందేల బరులను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు.

Sankranthi 2025: జోరుగా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్లు 8/8

పలు తోటలు, పొలాల్లో వేసిన బరులను పోలీసులు ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. కొన్నిచోట్ల మాత్రం బరులను బహిరంగంగానే ఏర్పాటు చేస్తున్నారు. వాటి వెనుక రాజకీయ నేతల బలం ఉండటంతో అటు వైపుగా పోలీసులు చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated at - Jan 13 , 2025 | 01:28 PM