Rajahmundry Airport :రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం
ABN, Publish Date - Jan 24 , 2025 | 04:45 PM
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం నాడు ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలోని టెర్మినల్ భవన నిర్మాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఇటీవల నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం నాడు ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలోని టెర్మినల్ భవన నిర్మాణంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అయితే ఇటీవల నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.

రాజమండ్రి విమానాశ్రయంలో టెర్మినల్ కూలిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరా తీశారు.

కేంద్ర ప్రభుత్వం తరపున దావోస్ పర్యటనలో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అక్కడి నుంచే అధికారులతో మాట్లాడి రామ్మోహన్ నాయుడు వివరాలు తెలుసుకున్నారు.

ఎయిర్ పోర్ట్ అథారిటీ, పౌర విమానయాన అధికారులతో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.

ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.
Updated at - Jan 24 , 2025 | 04:57 PM