Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన

ABN, Publish Date - Oct 10 , 2025 | 08:17 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం నాడు కాకినాడ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పిఠాపురం పరిధిలోని ఉప్పాడలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మత్స్యకారులతో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. సముద్రంలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాల ప్రాంతాలను మరో మూడు రోజుల్లో బోటులో వెళ్లి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 1/15

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం నాడు కాకినాడ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పిఠాపురం పరిధిలోని ఉప్పాడలో పర్యటించారు.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 2/15

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మత్స్యకారులతో బహిరంగ సభ నిర్వహించారు.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 3/15

అనంతరం పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 4/15

సముద్రంలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాల ప్రాంతాలను మరో మూడు రోజుల్లో బోటులో వెళ్లి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 5/15

ఏపీలో నక్కపల్లి, కాకినాడ సెజ్‌లు, దివీస్‌, అరబిందో తదితర పరిశ్రమలు వైఎస్‌ హయాంలో వచ్చినవేనని గుర్తుచేశారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 6/15

కూటమి పార్టీలు ప్రారంభించినవి కాదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 7/15

ఈ పరిశ్రమల ద్వారా వెదజల్లే జల, వాయు కాలుష్యంపై ఆడిట్‌ చేయిస్తానని తెలిపారు.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 8/15

అంతకుముందు కాకినాడ కలెక్టరేట్‌లో పలువురు మత్స్యకార ప్రతినిధులతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 9/15

మత్స్యకార ప్రతినిధులతో చర్చించి.. వారి సమస్యలు తెలుసుకున్నారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 10/15

పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయన, జల, శబ్ధ, వాయి కాలుష్యంవల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 11/15

మత్స్యకారులు, ఎన్‌జీవో ప్రతినిధులు ఇదే విషయాన్ని తనకు వివరించారని గుర్తుచేశారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 12/15

తమ ప్రభుత్వం పరిశ్రమలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 13/15

కానీ పరిశ్రమలు మత్స్యకారుల ఉపాధి, జీవనోపాధిని దెబ్బతీయకూడదని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 14/15

గోదావరి జిల్లాలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆక్వాకల్చర్‌ వల్ల ప్రభుత్వానికి రూ.1.30 లక్షల కోట్ల ఆదాయం వస్తోందని ఉద్ఘాటించారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan:ఉప్పాడలో పవన్ కల్యాణ్ పర్యటన 15/15

ప్రత్యక్షంగా 3.72 లక్షల మందికి, పరోక్షంగా 15 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు నాలుగు రోజులు ధర్నాలు, ఆందోళనలు చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Updated at - Oct 10 , 2025 | 08:22 AM