Naga Babu: అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: నాగబాబు
ABN, Publish Date - Feb 03 , 2025 | 06:52 AM
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ‘ జనం లోకి జనసేన‘ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో జనసేన అగ్రనేత నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నాగబాబుకు జనసేన నేతలు అపూర్వ స్వాగతం పలికారు.

ఈ సభకు జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

ఈ సభలో వైసీపీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు.అవినీతి నేతలను జైలుకు పంపిస్తామని నాగబాబు తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీలో ఎవరూ ఉండరని నాగబాబు విమర్శించారు.

పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు.

అసెంబ్లీకి రాని పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో చెరువులు ఆక్రమించారని ఆరోపించారు. అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని నాగబాబు విమర్శించారు.

ఈ సభలో జనసేన ముఖ్య నేతలు వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Updated at - Feb 03 , 2025 | 06:53 AM