Minister Nara Lokesh: స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి

ABN, Publish Date - Jul 15 , 2025 | 09:20 AM

మంగళగిరి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని సోమవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ప్రారంభించారు.

Minister Nara Lokesh: స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి 1/8

మంగళగిరి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు.

Minister Nara Lokesh: స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి 2/8

చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని సోమవారం ఉండవల్లి నివాసంలో ప్రారంభించారు. ఈ మేరకు అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Minister Nara Lokesh: స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి 3/8

అధికారులు ఛాలెంజ్‌గా తీసుకుని వందరోజుల్లో మంగళగిరిలో గుంతలు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు.

Minister Nara Lokesh: స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి 4/8

మంగళగిరిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.

Minister Nara Lokesh: స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి 5/8

స్వచ్ఛతలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేలా సుమారు రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను ప్రారంభించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Minister Nara Lokesh: స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి 6/8

చెత్తను తరలించేందుకు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న రూ.1.91 కోట్ల విలువైన రెండు కాంపాక్టర్ వాహనాలు రాష్ట్రంలోనే మొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Minister Nara Lokesh: స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి 7/8

ఎంటీఎంసీ పరిధిలో బీటీ రోడ్లపై ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు రూ.1.48 కోట్ల విలువైన పాత్ హోల్ రిపేర్ వాహనంతో పాటు సుమారు రూ.1.2 కోట్ల విలువైన రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Minister Nara Lokesh: స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి 8/8

మంగళగిరిలో రోడ్లపై గుంతలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ఛాలెంజ్‌ను అధికారులు స్వీకరించాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated at - Jul 15 , 2025 | 09:26 AM