CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jul 19 , 2025 | 07:06 AM

అమరావతి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించే ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌-2025’ను జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మిట్‌ని ప్రారంభించారు. గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో వివిధ కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్‌తో విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాల గురించి సీఎం చర్చించారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, సీఎస్ విజయానంద్, ఇంధన రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 1/9

అమరావతి SRM యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 2/9

గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో వివిధ కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 3/9

ఈ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం, ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్‌తో విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాల గురించి సీఎం చంద్రబాబు చర్చించారు.

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 4/9

ఈ సదస్సుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, సీఎస్ విజయానంద్, ఇంధన రంగానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 5/9

ఏపీని ‘గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ’గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 6/9

సమ్మిట్‌లో పాల్గొన్న పలువురు ప్రముఖులు

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 7/9

గ్రీన్‌ హైడ్రోజన్‌కు గత పదేళ్లలో ప్రాధాన్యం ఏర్పడిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుత విద్యుత్‌ అవసరాల కోసం 40శాతం మేర.. ఇతర దేశాలపై ఆధారపడుతున్నామని పేర్కొన్నారు.

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 8/9

ఏపీలో ఎకో సిస్టమ్‌ని ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 400 కేటీపీఏ హైడ్రోజన్‌ డిమాండ్‌ ఉందని.. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని వెల్లడించారు.

CM Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు 9/9

సీఎం చంద్రబాబుతో మాట్లాడుతున్న పలువురు ప్రముఖులు

Updated at - Jul 19 , 2025 | 07:09 AM