CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jan 14 , 2025 | 08:13 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బిజీబిజీగా గడిపారు. ఓవైపు కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూనే.. మరో వైపు సొంతూరి అభివృద్ధికి పలు శంకుస్థాపనలు చేశారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 1/11

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బిజీబిజీగా గడిపారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 2/11

ఓవైపు కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూనే.. మరో వైపు సొంతూరి అభివృద్ధికి పలు శంకుస్థాపనలు చేశారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 3/11

అటు సంబరాల్లో, ఇటు అభివృద్ధి కార్యకలాపాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ చంద్రబాబు తన కోసం వచ్చిన సామాన్య ప్రజల నుంచీ అర్జీలు స్వీకరించారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 4/11

కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 5/11

ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 6/11

ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, డీఐజీ శేముషీ బాజ్‌పాయ్‌, మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గాలి భానుప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 7/11

చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి సారించారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 8/11

అందులో భాగంగా రేవాండ్స్‌ కంపెనీ ద్వారా నారావారిపల్లె రైతులు బలరాం నాయుడు, జ్యోతిలకు డ్రిప్‌ పరికరాలను అందజేశారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 9/11

ఈ సందర్భంగా ఏ ఊరి పరిసరాల్లోని మూడు సచివాలయాల పరిధిలో అర్హులైన రైతులను ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం (ఏపీఎంఐపీ) పరిధిలోకి చేర్చాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను ఆదేశించారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 10/11

అలాగే రూ.4.27 కోట్లతో 33 కేవీ ఇన్‌డోర్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

  CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు 11/11

సబ్‌ స్టేషన్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయడంతో పాటు నారావారిపల్లె పరిధిలో 2 వేల ఇళ్లకు సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను, డిస్కమ్‌ సీఎండీ సంతోషరావును సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Updated at - Jan 14 , 2025 | 08:16 AM