Anantapur ZP Meeting: అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాస

ABN, Publish Date - Jan 30 , 2025 | 06:47 PM

అనంతపురం జెడ్పీ సమావేశం గురువారం నాడు రసాభాసగా జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాట్సాప్‌ గవర్నెన్స్ అంశంపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఆగ్రహంతో ఇరుపక్షాలు ఊగిపోయాయి.

Anantapur ZP Meeting: అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాస 1/6

జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. నిధుల మంజూరు, అభివృద్ధి విషయంలో గత వైసీపీ పాలనలో ఏం జరిగిందని అధికారపక్షం ప్రశ్నల వర్షం కురిపించింది.

Anantapur ZP Meeting: అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాస 2/6

ఈ సమావేశంలో మంత్రి సవిత, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, టీడీపీ, వైసీపీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.

Anantapur ZP Meeting: అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాస 3/6

వైసీపీ హయాంలో తన మండలానికి నిధులు ఇవ్వలేదని టీడీపీ అగలి జేడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగలి జెడ్పీటీసీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా వైసీపీ, జెడ్పీటీసీ సభ్యులను ఉసిగొల్పడంపై అసహనం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అడ్డదిడ్డంగా మాట్లాడుతుందని ఎంపీ బీకే పార్థసారథి మండిపడ్డారు.

Anantapur ZP Meeting: అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాస 4/6

వివిధ అంశాలపై ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకొనే దశలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కల్పించుకొని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.

Anantapur ZP Meeting: అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాస 5/6

రాజకీయాలే చేయాలనుకుంటే ఇది సరైన వేదిక కాదని జెడ్పీ సభ్యులకు కాలవ సూచించారు. కావాలంటే మీరేమి చేశారో, మేమేమి చేస్తున్నామో చర్చించుకునేందుకు ప్రత్యేక సమావేశం పెట్టుకొని వాదులాడు కొందామన్నారు. అధికారులతో ఏ పని చేయించుకొంటే ప్రజలకు ఉపయోగమో వాటిపై మాట్లాడాలని సూచించారు. ఎంతో విలువైన కాలాన్ని ఇలా వృథా చేయడం తగదని హితవు పలికారు. అధికారులు కూడా సభ్యుల సమస్యలకు సమాధానాలు ఇవ్వాలని, కేవలం ఏదో రాసుకొచ్చి చదివితే సరిపోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సభ్యులు హుందాగా జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించారు.

Anantapur ZP Meeting: అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాస 6/6

ఈ సమావేశం జరగకుండా వైసీపీ జెడ్పీటీసీలు అడ్డుపడుతున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ జెడ్పీటీసీలకు లేదని మంత్రి సవిత చెప్పారు. టీడీపీ జెడ్పీటీసీ అనే అక్కసుతో గత వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి సవిత స్పష్టం చేశారు.

Updated at - Jan 30 , 2025 | 06:52 PM