ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

ABN, Publish Date - Dec 07 , 2025 | 09:52 PM

కర్ణాటకలోని ఉడుపిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం (07-12-2025) పర్యటించారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు బృహత్ గీతోత్సవ్ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 1/9

కర్ణాటకలోని ఉడుపిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం (07-12-2025) పర్యటించారు.

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 2/9

పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు బృహత్ గీతోత్సవ్ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 3/9

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 4/9

ఉడుపిలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధర్మాన్ని మీరు కాపాడితే.. అది మిమ్మల్ని కాపాడుతుందన్నారు.

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 5/9

తన గోశాలలో 60 ఆవులు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆవులను సంరక్షించేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 6/9

ఉడుపిలోని శ్రీకృష్ణుడి దేవాలయంలో ఆయన కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఆలయంలోని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 7/9

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 8/9

శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీసుగుణేంద్ర తీర్థ స్వామిజీ ఆశీర్వచనాన్ని పవన్ కల్యాణ్ తీసుకున్నారు.

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 9/9

ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ వెంట.. ఆయన స్నేహితుడు ఆనందసాయి ఉన్నారు.

Updated at - Dec 07 , 2025 | 09:52 PM