ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహణలో జరిగిన అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం
ABN, Publish Date - Jan 28 , 2025 | 09:35 PM
ప్రజల స్థానిక సమస్యలను అధికార యంత్రాంగానికి నివేదించి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లే పరిష్కార వారధిగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రూపకల్పన చేసిన 'అక్షరం అండగా.. పరిష్కా రమే అజెండాగా' కార్యక్రమం నేడు ప్రారంభం అయింది

చిత్తూరు జిల్లాలోని సంతపేటలో కార్యక్రమం జరిగింది . విజయలక్ష్మి కాలనీ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదిక అయింది

సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, నీటి పాల సమస్యలు వంటివి ఈ సదస్సుకు హాజరయ్యిన కార్పొరే షన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది

ఈ సదస్సుకు మేయర్ అముడ, కమిషనర్ నరసింహ ప్రసాద్ తో పాటు పలు శాఖం మున్సిపల్ అధికారులు హాజరు అయ్యారు

కర్నూల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరం అండగా సమస్యల పరిష్కరమే అజెండాగా కార్యక్రమ దృశ్యాలు

హాజరైనా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు

తమ సమస్యలను విన్నవించుకున్న ప్రజలు.పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జిల్లా అధికారులు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది

విశాఖపట్నం వడ్లపూడి తిరుమల నగర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమం

రోడ్లపై గుంతల నుంచి కుళాయిల్లో రాని నీళ్ల దాకా సమస్యలను ప్రజాప్రతినిధుల ముందు విన్నవించుకున్న ప్రజలు
Updated at - Jan 28 , 2025 | 09:35 PM